విజయ్ దేవరకొండ చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల విజయ్ దేవరకొండ తాను కొన్ని కుటుంబాలకి కోటి రూపాయలు ఇస్తున్నట్టు ప్రకటించారు.

Video Advertisement

ఈ విషయం ప్రకటించిన తర్వాత ఎంతో మంది అభిమానులు, “విజయ్ దేవరకొండ చాలా మంచి పని చేస్తున్నారు” అంటూ అభినందిస్తున్నారు.

అయితే ఈ క్రమంలో విజయ్ దేవరకొండ చేసిన పాత సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఇప్పుడు చేసిన ఒక పోస్ట్ వార్తల్లో నిలిచింది. రెండు సంవత్సరాల క్రితం విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ అయ్యి ఘోరమైన పరాజయం చవి చూసింది. ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరించిన అభిషేక్ పిక్చర్స్ విజయ్ దేవరకొండ కోటి రూపాయలు విరాళం ప్రకటించిన క్రమంలో ట్వీట్ చేశారు. అందులో ఈ విధంగా రాశారు.

abhishek pictures post on vijay devarakonda

ఈ విషయంపై వాళ్లు మాట్లాడుతూ, “డియర్ విజయ్ దేవరకొండ, వరల్డ్ ఫేమస్ లవర్ డిస్ట్రిబ్యూషన్ లో భాగంగా మాకు 8 కోట్ల నష్టం వచ్చింది. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. ఇప్పుడు మీరు ప్రతి కుటుంబానికి పెద్ద మనసు చేసుకొని ఒక కోటి రూపాయలు డొనేట్ చేస్తున్నారు కాబట్టి, మా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కుటుంబాలని కూడా కొంచెం ఆదుకోవాలి అని విజ్ఞప్తి చేస్తున్నాం. థాంక్యూ. మీ అభిషేక్ పిక్చర్స్.” అని రాశారు.

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాకి క్రాంతి మాధవ్ దర్శకత్వం వహించారు. సినిమా చాలా భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది. సినిమా ట్రైలర్ చూసిన వాళ్లు ఇది ఒక ప్రేమ కథ అని అనుకున్నారు. సినిమా ప్రేమ కథ అయినా కూడా, అర్జున్ రెడ్డి సినిమా షేడ్స్ ఈ సినిమాలో చాలా ఉండటంతో, స్టోరీ పరంగా కూడా చాలా బలహీనంగా ఉండడంతో సినిమాని ప్రేక్షకులు ఆదరించలేదు.

కేవలం ఐశ్వర్య రాజేష్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రమే బాగుంది అని అన్నారు. ఈ సినిమా తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా రిలీజ్ అయ్యింది. విజయ్ దేవరకొండ ఒక లవ్ స్టోరీ చేస్తున్నారు అని ఆశించిన ప్రేక్షకులకి ఈ సినిమా నిరాశ మిగిల్చింది. ఇప్పుడు ఈ సినిమా నిర్మాతలు చేసిన ట్వీట్ పై చాలా మంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

ALSO READ : మళ్లీ దొరికేశారు.! 38 ఏళ్ల క్రితం సినిమాని ఇప్పుడు ఫ్రీమేక్ చేశారా..?