102 డిగ్రీల జ్వరంలో కూడా ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కోసం ఎంత పని చేసిందో తెలుసా..?

102 డిగ్రీల జ్వరంలో కూడా ఆర్తి అగర్వాల్ ఎన్టీఆర్ కోసం ఎంత పని చేసిందో తెలుసా..?

by Anudeep

Ads

అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లలో ఒకరు ఆర్తి అగర్వాల్. మెరుపుల పరిశ్రమలోకి ప్రవేశించి అనతికాలంలోనే అగ్రశ్రేణి హీరోలతో నటించి స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది.  విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ చిత్రంతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది ఆర్తి అగర్వాల్. తన మొదటి చిత్రంతోనే అందం, అభినయంతో ప్రేక్షకుల మదిని దోచేసింది.

Video Advertisement

20వ దశాబ్దంలో ఉదయ్ కిరణ్, తరుణ్,  ప్రభాస్ వంటి యంగ్ హీరోతోనే కాకుండా సీనియర్ స్టార్ హీరోస్ అయిన చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటివారితో కూడా నటించి అగ్రస్థాయి కథానాయికగా పేరు సంపాదించుకుంది. 2001లో కెరీర్ మొదలు పెట్టిన ఆర్తీఅగర్వాల్ దాదాపు నాలుగు సంవత్సరాల పాటు తీరిక లేని బిజీ షెడ్యూల్తో ఇండస్ట్రీలో వరుస సినిమా ఆఫర్లను చేజిక్కించుకుంది.

Aarthi Agarwal story

ఆ తర్వాత ఆర్తి అగర్వాల్ కెరీయర్ గ్రాఫ్ నెమ్మది నెమ్మదిగా దిగిపోతువచ్చింది. శరీరాకృతిలో మార్పులు రావడం, ప్రముఖ హీరోతో లవ్ ఎఫైర్ అంటూ వార్తలు రావడం, అలా సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో పాటు కొంతకాలానికి వివాహం చేసుకుంది ఆర్తి అగర్వాల్. భర్తతో మనస్పర్థలు కారణంగా విడాకులిచ్చి చిత్రాలలోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్న సమయంలో లైపోసెక్షన్ ఆపరేషన్ వికటించి మృతిచెందారు ఆర్తి అగర్వాల్.

 

ఆర్తి అగర్వాల్ చిత్రాలలో నటించేటప్పుడు ఆమె డెడికేషన్ గురించి ఆమెతో కలిసి పని చేసిన నిర్మాతలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఆమె కెరీర్ నాశనం అవ్వడానికి కేవలం ఆమె తండ్రి నిర్ణయాలే కారణం అంటూ చెప్పుకొచ్చారు. ఆర్తి అగర్వాల్ నటించిన సీన్లు అభ్యంతరాలు ఉంటే ఆమె తండ్రి వెంటనే చెప్పేవారట. ఆమె తల్లిదండ్రులు ఉన్నప్పుడు కొన్ని  సీన్స్ చేయాలంటే ఆమె కొంచెం బిడియంగా నటించదట. అదే ఆమె తల్లిదండ్రులు సెట్స్లో లేని సమయంలో ఎలాంటి సన్నివేశాలు అయినా సునాయాసంగా నటించదట.

బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన అల్లరి రాముడు చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరియు ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా కలిసి నటించారు. ఈ చిత్రం షూటింగ్ టైంలో ఆమె వర్షంలో తడవడం తో 102 డిగ్రీల జ్వరంతో బాధపడిందట. ఒక రోజు షూటింగ్ కు రాకపోతే తన వలన ఎన్టీఆర్ మరియు డైరెక్టర్ బి.గోపాల్ డేట్స్ వృధాగా పోతాయని భావించి అంత జ్వరంతో టాబ్లెట్స్ వేసుకొని రోజు షూటింగ్ లో నటించిందట ఆర్తి అగర్వాల్. ఆమె డెడికేషన్ చూసి తన తరువాత చిత్రం ప్రభాస్ హీరోగా నటించిన  అడవి రాముడు లో కూడా అవకాశం ఇచ్చాము. అంత చిత్తశుద్ధిగా పనిచేసే నటి ఆర్తి అగర్వాల్ అని నిర్మాత చంటి అడ్డాల ఓ సందర్భంలో తెలియజేశారు.


End of Article

You may also like