Ads
చిరంజీవి, రామ్ చరణ్ కలిసి తెరపై కనిపిస్తే చూడాలని చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అంతకుముందు మగధీర సినిమాలో, ఆ తర్వాత బ్రూస్ లీ సినిమాలో చిరంజీవి చిన్న పాత్రలో కనిపించారు. అలా కాకుండా వారిద్దరూ కలిసి ఒక ఫుల్ లెంత్ సినిమాలో నటించాలి అని అందరూ అనుకున్నారు. ఆచార్య సినిమాతో అది జరుగుతుంది అని తెలిసాక అసలు సినిమా ఎలా ఉండబోతోంది?
Video Advertisement
ఇద్దరికీ సమానమైన పాత్రలు ఉంటాయా? అని అనుకున్నారు. కానీ సినిమా విషయానికి వచ్చేటప్పటికీ ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి చేసిన ప్రయత్నం ఫలించలేదు అని చెప్పాలి.
సినిమా కథ మనం చాలా సినిమాల్లో చూశాం. సినిమా నడుస్తున్న కొద్దీ ఏమవుతుంది అనే ఆసక్తి ఎవరిలో ఉండదు. ఎందుకంటే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిపోయి ఉంటుంది. చాలా చోట్ల సినిమా డల్ గా అనిపిస్తుంది. పర్ఫార్మెన్సెస్ విషయానికొస్తే, మెగా స్టార్ ఆచార్య పాత్రలో బాగా చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ఎనర్జీ తగ్గినట్టు అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేకపోయినప్పటికి నటించడానికి కూడా పెద్దగా ఆస్కారం లేదు. రామ్ చరణ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో రామ్ చరణ్ పాత్రలో కనిపిస్తారు. రంగస్థలం, ఆర్ఆర్ఆర్ సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో రామ్ చరణ్ నటన ఆకట్టుకునేలాగా అనిపించదు.
మొదటిరోజు కేవలం 70 శాతం అక్యుపెన్సీతో మాత్రమే ఆచార్య ప్రదర్శితమైంది. అయితే.. కథనం ఆకట్టుకునే విధంగా లేదు అంటూ టాక్ కూడా వినిపించింది. ఇది ఇలా ఉంటె.. సినిమా రిలీజ్ కంటే ముందే ఆచార్య స్టోరీ ఇదే అంటూ ఓ స్టోరీ నెట్టింట్లో తెగ వైరల్ అయింది. ఈ వైరల్ స్టోరీ లో చిరంజీవి దేవాలయ శాఖాధికారిగా నటిస్తారని, దేవాలయాల భూములకు సంబంధించిన మోసాలకు చెక్ పెట్టేస్తారని, దేవుడి భూములతో ఆటలాడేవాడికి ఎలా చెక్ పెడతారు అన్న కథాంశంతో ఈ సినిమా రూపొందుతోందని వార్తలు వచ్చాయి.
కానీ, సినిమా రిలీజ్ అయ్యాక ఈ స్టోరీ కి, వైరల్ అయిన కథకి సంబంధం లేదని తెలిసింది. అయితే ఒరిజినల్ ఆచార్య సినిమా స్టోరీ కంటే వైరల్ అయిన స్టోరీనే బాగుంది అంటూ నెటిజన్లు తెగ కామెంట్స్ చేసేస్తున్నారు. ఏది ఏమైనా ఆచార్య సినిమా ఆశించినంతగా ప్రేక్షకులని ఆకట్టుకోలేదు.
End of Article