Ads
నటుడిగా బ్రహ్మాజీకి ఈ సెకండ్ ఇన్నింగ్స్ అద్భుతంగా ఉన్నట్టుంది. పైగా బ్రహ్మాజీ నటించిన సినిమాలన్నీ కూడా బాగా ఆడుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మాజీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నాడు. శోభన్, ఫరియా నటించిన లైక్ షేర్ సబ్ స్క్రైబ్ సినిమాలో నటించాడు బ్రహ్మాజీ.
Video Advertisement
ప్రస్తుతం ఈ మూవీ టీం సుమ క్యాష్ షోకు గెస్టుగా వెళ్లింది. ఈ ఎపిసోడ్ ఈ శనివారం టెలీకాస్ట్ అవుతుంది. అయితే దీని ప్రోమోను తాజాగా విడుదల చేశారు. అందులో బ్రహ్మాజీ ఒకే డైలాగ్‌తో అదరగొట్టారు. అదే ‘కమ్ టు మై రూమ్’.
అసలే బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఫుల్ ఫాంలో ఉంటాడు. ట్రెండ్‌ల మీద ఎక్కువగా పట్టు ఉంటుంది. ఏం జరుగుతోందో అని పరిశీలిస్తుంటాడు. ఇక సుమ, బ్రహ్మాజీ ఒకే స్టేజ్ మీద ఉన్నారంటే.. నవ్వులే నవ్వులు. అయితే ఇందులో ఓ సందర్భంలో బ్రహ్మాజీ ఫోటో పక్కన ఫరియా ఫోటోను పెడుతుంది సుమ. ఎంత బాగుందో కదా? అని సుమ అంటే.. కొందరు నవ్వుతారు.
ఎవడ్రానవ్వింది.. కమ్ టు మై రూం అని వార్నింగ్ ఇస్తాడు బ్రహ్మాజీ. ఇది ప్రభాస్ స్టైల్లో చెప్పాడు. ఎందుకంటే ఆదిపురుష్ టీజర్ రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ వీడియో ఒకటి వైరల్ అయింది. వేర్ ఈజ్ ఓం.. ఓం కం టు మై రూం అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. ఆదిపురుష్ టీజర్ బాగా లేకపోవడంతో ప్రభాస్ సీరియస్ అయ్యాడు.. ఓం రౌత్‌కు వార్నింగ్ ఇచ్చాడంటూ అందరూ ప్రచారం చేశారు ఆ వీడియోని.
ఇప్పుడు అదే టోన్‌లో బ్రహ్మాజీ కూడా కౌంటర్ వేశాడు. ఇలా ట్రెండింగ్ అంశాల మీద మంచి గ్రిప్ సాధిస్తుంటాడు బ్రహ్మాజీ. తన సోషల్ మీడియా ఖాతాల్లోనూ ఇలానే కౌంటర్లు వేస్తుంటాడు బ్రహ్మాజీ.
End of Article