Ads
కమెడియన్ వేణు దర్శకత్వం లో దిల్ రాజు నిర్మించిన బలగం చిత్రం ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా అందరినీ సర్ప్రైజ్ చేస్తూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఎమోషనల్ కంటెంట్‌తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
Video Advertisement
చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించి.. జాతీయ స్థాయిలో అవార్డుల్ని సొంతం చేసుకుంది. అయితే ఈ చిత్రం లో కొమరయ్య చిన్న కొడుకుగా నటించి.. అందరి కంట కన్నీళ్లు పెట్టించారు నటుడు మధుసూధన్ అలియాస్ మైమ్ మధు. చక్రవాకం సీరియల్లో తన అద్భుతమైన నటనతో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన మైమ్ మధు.. బలగం సినిమాలో బలమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
అయితే నటుడిగా కంటే మైమ్ తోనే ఎక్కువ గుర్తింపు పొందారు మధు. ఈ రంగం లో ఎన్నో ప్రత్యేకతలు సంపాదించారు. చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ చిన్న చిన్న పాత్రలే చేసారు మధు. ఇక ఇటీవల వచ్చిన ఆకాశవాణి, బలగం చిత్రాల్లో మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించారు. తాను ఏ పాత్రనైనా అవలీలగా చేయగలనని నిరూపించుకున్నాడు మైమ్ మధు.
మైమ్ మధు మైమ్‌లో ప్రొఫెషనల్ యాక్టర్. మైమ్ యాక్టింగ్‌లో శిక్షణ పొందిన ముధుసూధన్ మైమ్ యాక్టింగ్‌లో పరిణితి సాధిస్తూ మైమ్ మధుగా మారారు. దేశ విదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చిన మైమ్ మధు.. హ్యూమన్ రీసెర్చ్ నుంచి స్కాలర్ షిప్ అందుకున్నారు. మైమ్ ప్రదర్శనల ద్వారా ఫెలోషిప్, స్కాలర్ షిప్స్ అందుకుని ఎడ్యుకేషన్ పూర్తి చేశాడు. అలాగే అమెరికన్ మైమ్ థియేటర్స్ నుంచి స్కాలర్ షిప్ అందుకున్న తొలి భారతీయుడిగా గుర్తింపు పొందారు.
హైదరాబాద్ కు వచ్చిన తర్వాత వివిధ కళాశాలల్లో నటనలో శిక్షణ ఇచ్చారు మధు. అప్పుడే చక్రవాకం సీరియల్ లో నటించారు. ఈ సీరియల్లో దాదాపు 500పైగా ఎపిసోడ్లలో నటించారు మధు. అంతే కాకుండా ఈయన పలువురు స్టార్ హీరోలకి డబ్బింగ్ కూడా చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా శ్రావణసమీరాలు సీరియల్‌కి గానూ.. నంది అవార్డ్ అందుకున్నారు. ఇండియన్ మైమ్ అకాడమీ స్థాపించి అనేక మందికి నటులకు మైమ్‌లో శిక్షణ ఇచ్చారు మధు. ప్రస్తుతం వరుస సినీ అవకాశాలతో బిజీ గా ఉన్నారు.
End of Article