నటుడు మురళి శర్మ భార్య ఎవరో తెలుసా.? ఆ సినిమాలో లేడీ విలన్.!

నటుడు మురళి శర్మ భార్య ఎవరో తెలుసా.? ఆ సినిమాలో లేడీ విలన్.!

by Mounika Singaluri

రాజనాల మొదలుకొని కైకాల సత్యనారాయణ , కోటా శ్రీనివాసరావు , నర్రా వెంకటేశ్వర్రావు , రామిరెడ్డి, సత్య, అమ్రిష్ పూరి ఇలా చెప్పుకుంటూ పోతే మన విలన్ల లిస్టు పెద్దదే. సినిమాల్లో విలన్లుగా వీళ్లని చూడగానే దడపుట్టేది . ఒక సినిమా సూపర్ హిట్ అవ్వడంలో హీరో పాత్ర ఎంతుంటుందో,హీరోకి ధీటుగా ఉండే విలన్ పాత్ర కూడా అంతే ఉంటుంది.

Video Advertisement

ఇప్పటి చిత్రాల్లో విలన్ అనగానే గుర్తొచ్చే మొదటి పేరు ప్రకాశ్ రాజ్ . తండ్రిగా ప్రేమని ప్రదర్శిస్తూనే ఒకే సమయంలో విలన్ గా కూడా విలక్షణంగా నటించగల నటుడు ప్రకాశ్ రాజ్ .ప్రభాకర్,అజయ్, ముకేశ్ రుషి, షియాజి షిండే, పరేష్ రావెల్,అశుతోష్ రానా, రోబో చిత్ర విలన్ డాని, మురళి శర్మ వీళ్లందరిది విలనిజంలో విభిన్న పంథా.

మురళీ శర్మ గురించి చెప్పాలంటే…భలే భలే మగాడివోయ్, నిన్ను కోరి, అల వైకుంఠపురం లో ఇలా చాలా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. అప్పట్లో అతిధి సినిమాలో ఆయన పాత్ర గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఆయన కుటుంబం, భార్య పిల్లల గురించి చాలా మందికి తెలియదు. ఆయన భార్య పేరు అశ్విని కాల శేఖర్. ఆమె కూడా నటే. బద్రీనాథ్ సినిమాలో విలన్ భార్యగా నటించారు. తమన్నాతో ఆమె చెప్పే డైలాగ్ ” నేనెవరో తెలుసా నీ మేనత్తని ఈ రాష్ట్రాన్ని పాలించే సర్కార్ భార్యని” చాలా ఫేమస్. రవితేజ “నిప్పు”, మెహబూబా సినిమాల్లో కూడా ఈమె నటించారు.


You may also like

Leave a Comment