ఎక్కువగా నెగిటివ్ షేడ్స్ చేసేవారు పృథ్వీ. ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. పెళ్లి, చెన్నకేశవ రెడ్డి, నువ్వు నాకు నచ్చావ్, గౌతమ్ SSC ఇలా ఎన్నో సినిమాల్లో నటించాడు. సీరియళ్ల లో కూడా నటించి మెప్పించాడు పృథ్వి.

Video Advertisement

ఇది ఇలా ఉంటే కొంత కాలం నుండి సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ పృథ్వి కనపడడం లేదు. అయితే ఈయన ఎందుకు సినిమాల్లో కానీ సీరియల్స్ లో కానీ కనపడడం లేదు అనేది చూస్తే..

పృథ్వి ఇండస్ట్రీ లో కనపడక  పోవడం వెనుక బలమైన కారణం వుంది. పృథ్వీ తాజాగా ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు. పైగా ఆఫర్స్ రావక పోవడం ఏమి లేదు. వరుస ఆఫర్లు వస్తున్న సమయం లోనే పృథ్వి ఇండస్ట్రీ నుండి దూరం అయ్యాడు. పృథ్వి  కి ఒకే ఒక్క అబ్బాయి వున్నాడట. తన వయస్సు 27 సంవత్సరాలు. అయితే ఈ బాబు కి మానసిక ఎదుగుదల లేదని.. మాట్లాడలేడని చెప్పాడు.

ఈ విషయం తెలిసినప్పటి నుంచి తాను డిప్రెషన్ లోకి వెళ్ళి పోయాడట. దీని మూలంగా తొమ్మిది ఏళ్ళు డిప్రెషన్ లో ఉన్నాడట. ఆ టైం లో ఈయన సినిమాలకు దూరంగా ఉన్నారట. అదే విధంగా తాను సినిమాల్లో నటిస్తున్నప్పుడు కొంత మంది హీరోలు తన పాత్రలను కట్ చేయించారని అన్నాడు. అలా సీన్స్ ని కట్ చేసినప్పుడు ఎంతో బాధ కలిగినది అని చెప్పాడు. నిజానికి ఇలా జరిగితే ఎవరికైనా సరే ఎంతో బాధ కలుగుతుంది.

పృద్వి కూడా సీన్స్ ని కట్ చేసినప్పుడు ఎంతో బాధ పడ్డారట. కెరీర్ పై ఇలాంటివన్నీ కూడా నన్ను ఎఫెక్ట్ చేసాయి అని అన్నాడు. తాను చెప్పిన ఈ విషయాలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే ఇంకా తనకి అభిమానులు వున్నారు. పృథ్వీ భవిష్యత్తు ప్రాజెక్ట్ల తో సక్సెస్ అవ్వాలని అంటున్నారు ఫ్యాన్స్.