Ads
సినిమాల కోసం ఉద్యోగాలు వదిలేసి వచ్చిన వారిని చూశాం. చాలా మంది లక్షల్లో జీతాలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి వచ్చి, సినిమాల్లో ఎటువంటి నేపథ్యం లేకుండా కష్టపడి, ఆ తర్వాత గుర్తింపు సంపాదించుకుంటారు. ఇలా వచ్చిన వారిలో చాలా మంది ఉన్నారు. ఈ నటుడు కూడా అలాంటి ఒక మంచి ఉద్యోగం వదిలేసి సినిమాల్లోకి వచ్చి ఇప్పుడు గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ నటుడిని మీరు చాలా సినిమాల్లో చూసి ఉంటారు. గత కొద్ది సంవత్సరాల నుండి రిలీజ్ అవుతున్న ప్రతి హిట్ సినిమాలో ఈ నటుడు ఉంటున్నారు. ఈ నటుడి పేరు వడ్లమాని శ్రీనివాస్. వడ్లమాని శ్రీనివాస్ గారి పూర్తి పేరు వడ్లమాని సత్య సాయి శ్రీనివాస్. వడ్లమాని శ్రీనివాస్ గారు సినిమాల్లోకి రాకముందు వైజాగ్ జాయింట్ కలెక్టర్ గా చేశారు.
Video Advertisement
చిన్నప్పటినుండి కూడా వడ్లమాని శ్రీనివాస్ గారికి సినిమాలు, సాహిత్యం అంటే ఇష్టం ఉండేది. అయినా కూడా బాగా చదివి జాయింట్ కలెక్టర్ అయ్యారు కానీ నటుడు అవ్వాలి అని అనుకోలేదట. డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ వడ్లమాని శ్రీనివాస్ గారికి ఫ్యామిలీ ఫ్రెండ్. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో వడ్లమాని శ్రీనివాస్ గారు నటించారు. ఆ తర్వాత మారుతి దర్శకత్వం వహించిన మహానుభావుడు సినిమాలో కూడా నటించారు.
అప్పటికి కూడా వడ్లమాని శ్రీనివాస్ గారు జాయింట్ కలెక్టర్ గా చేస్తూ ఉండేవారు. ఉద్యోగం చేస్తూనే, గీత గోవిందం, ప్రతిరోజు పండగే, ఎఫ్ 2, డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటించారు. వి, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో వడ్లమాని శ్రీనివాస్ గారు పోషించిన పాత్రలకి మంచి గుర్తింపు వచ్చింది. సినిమాల్లో అవకాశాలు రావడంతో ఉద్యోగాన్ని వదిలేసి సినిమాల మీద దృష్టి పెట్టారు. ఇంత తక్కువ కాలంలోనే దాదాపు 70 సినిమాలకు పైగా సినిమాల్లో శ్రీనివాస్ గారు నటించారు. శ్రీనివాస్ గారు మొదటిగా రారండోయ్ వేడుక చూద్దాం సినిమాకి పదివేల రూపాయల పారితోషకం అందుకున్నారట. ఆ తర్వాత శైలజ రెడ్డి అల్లుడు సినిమాకి రోజుకి 30 వేల పారితోషకం తీసుకున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ గారు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.
End of Article