సలార్ లో బాచి మన్నార్ పాత్రలో నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా..?

సలార్ లో బాచి మన్నార్ పాత్రలో నటించిన ఈ నటుడు ఎవరో తెలుసా..?

by kavitha

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటస్ట్ సినిమా ‘సలార్’ బాక్సాఫీస్‏ దగ్గర రికార్డులు బద్దలుకొడుతుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం భారీ అంచనాలతో విడుదలై, నాలుగురోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.

Video Advertisement

ఊహించని స్థాయిలో కలెక్షన్స్ సాధిస్తున్న, ఈ చిత్రంలో నటించిన యాక్టర్ల గురించి ప్రస్తుతం దేశం అంతా మాట్లాడుకుంటుంది. బాల నటుల నుండి స్టార్ సెలబ్రెటీల వరకు అందరు తమ క్యారెక్టర్లలో ఒదిగిపోయి, అద్భుతంగా నటించారు. వారిలో బాచి మన్నార్ గా నటించిన నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
actor who acted as bachi mannar in salaarప్రభాస్, శృతిహాసన్ జంటగా నటించిన సలార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు. జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు, బాబీ సింహా, ప్రమోద్ పంజు ఇతర కిలక పాత్రలలో నటించారు. ఈ చిత్రం తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుని, భారీ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ చిత్రమలో నటించిన నటీనటులు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. అలాంటివారిలో ప్రమోద్ పంజు ఒకరు.
actor who acted as bachi mannar in salaarసలార్ లో వరద రాజమన్నార్ తమ్ముడు బాచి మన్నార్ పాత్రలో నటించి, మెప్పించాడు. ప్రమోద్ పంజు కన్నడంలో పాపులర్ యాక్టర్. 1990లో జనవరి 10న జన్మించాడు. మాండ్య జిల్లాకు చెందినవాడు. ప్రమోద్ పంజు మద్దూరులోని సెయింట్ ఆన్స్ ఉన్నత పాఠశాలలో చదువును పూర్తి చేశాడు. సురానా కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. 2015 లో శాండల్ వుడ్ లో అడుగుపెట్టాడు.
actor who acted as bachi mannar in salaarప్రమోద్ నటించిన మొదటి సినిమా గీతా బ్యాంగిల్ స్టోర్‌లో 11 సెప్టెంబర్ 2015న విడుదలైంది. ఆ తర్వాత 2019లో కన్నడ చిత్రం ప్రీమియర్ పద్మినిలో నటించాడు. మట్టే ఉద్భవ, అతను బుల్లితెర పై చుక్కి, పునర్వివాహ వంటి సీరియల్స్ లో నటించి, పాపులర్ అయ్యాడు. ప్రమోద్ మహాదేవి సీరియల్‌లో శివుడిగా నటించాడు. ఈ ఏడాది సలార్ పార్ట్ 1 లో నటించి, మరింత పాపులర్ అయ్యారు.


You may also like

Leave a Comment