అప్పుడు “మహేష్ బాబు” కి మరదలిగా… ఇప్పుడు అత్తగా నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?

అప్పుడు “మహేష్ బాబు” కి మరదలిగా… ఇప్పుడు అత్తగా నటించిన ఈ నటి ఎవరో తెలుసా..?

by Harika

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల అయ్యింది. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించారు. సినిమా టాక్ యావరేజ్ గా ఉన్నా కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి.

Video Advertisement

అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మొదటిగా వచ్చిన సినిమా అతడు. ఎటువంటి అంచనాలు లేకుండా ఈ సినిమా విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. మహేష్ బాబుని స్టార్ గా మరొక మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఒక దొంగ. తన వల్ల ఒక కుటుంబానికి నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్లడం, అక్కడ వారి సమస్యలు తీర్చడం అనే విషయం చుట్టూ ఈ సినిమా నడుస్తుంది.

actor who acted as cousin and mother in law to mahesh babu

ఇందులో అన్ని ఎమోషన్స్ ఉండేలాగా త్రివిక్రమ్ రాసుకున్నారు. సినిమాకి డైలాగ్స్ చాలా పెద్ద ప్లస్ అయ్యాయి. ఆ సమయంలో అలాంటి సింపుల్ డైలాగ్స్ రాసే రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంతో ఈ సినిమా డైలాగ్స్ చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటించారు. త్రిష అక్క పెళ్లి సమయానికి హీరో అక్కడికి వెళ్తాడు. త్రిష, అంటే పూరి అక్కగా నటించిన అమ్మాయి పేరు హారిక. హారిక ఆ సమయంలో ఎన్నో సీరియల్స్ లో నటించారు. సినిమాల్లో కూడా నటించారు.

actor who acted as cousin and mother in law to mahesh babu

సోగ్గాడి సరదాలు అనే ఒక సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఆ తర్వాత అతడు సినిమాలో కూడా హీరోయిన్ అక్కగా నటించారు. అతడు సినిమాలో లలిత అనే పాత్రలో హారిక నటించారు. అయితే తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో హారిక ఉన్నారు. శ్రీలీల తల్లిగా హారిక నటించారు. హారిక చాలా తక్కువ సీన్స్ లో ఈ సినిమాలో కనిపిస్తారు. శ్రీలీల, మురళీ శర్మ కాంబినేషన్ లో ఉన్న చాలా సీన్స్ లో హారిక కనిపిస్తారు. అలా అప్పుడు మరదలిగా, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి వరసకి అత్త అయ్యే పాత్రలో హారిక నటించారు.

ALSO READ : “కార్తీక దీపం” సౌందర్య గురించి ఈ విషయాలు తెలుసా.? ఆమె వయసు ఎంతంటే.?


End of Article

You may also like