ఈ వారం రిలీజ్ అయిన సినిమాలలో మ్యాడ్‌ ఒకటి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది అయిన నవీన్‌ నార్నే ఈ మూవీతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో ముగ్గురు హీరోలు నటించారు. ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్‌ దర్శకత్వం వహించారు.

Video Advertisement

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు, ట్రైలర్‌కు యూత్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. కాలేజ్‌ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ముగ్గురు హీరోలలో డీడీ క్యారెక్టర్ చేసిన నటుడి యాక్టింగ్ పై ఆడియెన్స్ అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఆ నటుడు ఎవరో ఇప్పుడు చూద్దాం..
టాలీవుడ్ లో ఇప్పటివరకు కాలేజ్‌ బ్యాక్ డ్రాప్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. యువతను ఫిదా చేశాయి. అలాంటి సినిమానే మ్యాడ్‌. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ యూత్ ను ఆకట్టుకుంది. కాలేజీలో గ్యాంగ్స్‌, సీనియర్లు, జూనియర్లు, ర్యాగింగ్‌, గొడవలు. ప్రేమలు వంటివాటిని ట్రైలర్ చూపించారు.
నేడు ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది. అయితే ఈ చిత్రంలో నటించిన ముగ్గురి హీరోలలో డీడీగా నటించిన యాక్టర్ తన నటనతో, కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నాడని టాక్. మూవీ చూసిన ఆడియెన్స్ సైతం అతని పై ప్రశంసలు కురిపిస్తున్నారు. రివ్యూయర్స్ సైతం ఆ కుర్రాడి స్టైల్, కామిడి టైమింగ్, డైలాగ్ డెలివరీ ని మెచ్చుకుంటున్నారు.
ఆ నటుడి పేరు సంగీత్ శోభన్. అతను ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి అలరించాడు. మ్యాడ్ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో తెలుగు ఇండస్ట్రీకి మంచి కామెడీ హీరో లభించాడు అనుకునేలా నటించాడు. సంగీత్‌ శోభన్ మరేవరో కాదు యంగ్ హీరో సంతోష్‌ శోభన్ తమ్ముడు మరియు దివంగత డైరెక్టర్ శోభన్ రెండవ కుమారుడు. అన్నయ్య సంతోష్ హీరోగా సీరిస్‌, సినిమాలలో నటిస్తుంటే, తమ్ముడు సంగీత్ కామెడీ సిరీస్ లలో, సినిమాలలో నటిస్తున్నాడు.

Also Read: MAD REVIEW : “ఎన్టీఆర్ బావమరిది” హీరోగా పరిచయం అయిన ఈ సినిమా ఆకట్టుకుందా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!