Ads
ఎన్నో అంచనాల మధ్య విశ్వక్ సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదల అయ్యింది. నేహా శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో, అంజలి ఒక ముఖ్య పాత్ర పోషించారు. కృష్ణ చైతన్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గోదావరిలో లంక అనే ఒక ఊరిలో ఉన్న రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమా నడుస్తుంది. సినిమా టైం లైన్ కూడా 80 కాలంలో ఉంటుంది. సినిమాలో వివిధ వయసులో ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. ఒక యంగ్ అబ్బాయి నుండి ఒక మధ్య వయసు వచ్చే వరకు లంకల రత్నాకర్ అనే ఒక పాత్రలో విశ్వక్ సేన్ నటించారు. సినిమాలో విశ్వక్ సేన్ నటనకి చాలా మంచి మార్కులు పడ్డాయి.
Video Advertisement
అయితే, ఈ సినిమాలో మరొక నటుడు కూడా హైలైట్ అయ్యారు. ఆ నటుడిని టీజర్ లో, ట్రైలర్ లో చూపించలేదు. డైరెక్ట్ గా సినిమాలోనే చూశారు. అతను విలన్ పాత్ర పోషించిన గోపరాజు రమణ కొడుకుగా నటించారు. ఈ నటుడి పేరు వినోద్ కిషన్. వినోద్ కిషన్ ఒక తమిళ నటుడు. 2001లో వచ్చిన నందా సినిమాలో సూర్య చిన్నప్పటి పాత్రలో నటించారు. ఆ తర్వాత ఎన్నో తమిళ్ సినిమాల్లో నటించారు. ఇటీవల వచ్చిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. 2012 లో వచ్చిన జీనియస్ అనే సినిమాలో తెలుగులో మొదటిగా నటించారు వినోద్ కిషన్. మళ్లీ అన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడే డైరెక్ట్ తెలుగు సినిమాలో నటించారు. నా పేరు శివ సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర పోషించారు.
కొన్ని షార్ట్ ఫిలిమ్స్, మ్యూజిక్ వీడియోలలో కూడా నటించారు. ఇప్పుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చారు. ఈ సినిమాలో వినోద్ కిషన్ నటనని చాలా మంది అభినందించారు. తన తండ్రికి జరిగిన అవమానం వల్ల బాధపడే ఒక కొడుకుగా నటించారు. ఈ సినిమాలో వినోద్ కిషన్ పాత్రలో నెగిటివ్ షేడ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే సినిమాలో జరిగే గొడవలకి వినోద్ కిషన్ పాత్ర కారణం అవుతారు. ఈ సినిమా తర్వాత వినోద్ కిషన్ కి తెలుగులో కూడా అవకాశాలు ఎక్కువగా వస్తాయి ఏమో.
End of Article