మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న తమన్నా సోషల్ మీడియాలో కొంతకాలంగా హాట్ టాపిక్ గా నిలుస్తోంది. ప్రస్తుతం ఆమె బిజీబిజీగా ఉంటోంది. సినిమా లేదా వెబ్‌ సిరీస్‌తో ఆడియెన్స్ ముందుకు వస్తోంది.

Video Advertisement

ఇటీవల రజనీకాంత్‌తో జైలర్‌, మెగాస్టార్‌ చిరంజీవితో భోళాశంకర్‌ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వాటికి ముందు  జీ కర్దా, ల-స్ట్ స్టోరీస్‌ వంటి వెబ్‌ సిరీస్‌లతో అలరించింది. తన కెరీర్ లో ఒకే హీరో తమన్నాకి హీరోగా, అన్నగా నటించారు. మరి ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
తమన్నా భాటియా 1989లో డిసెంబర్ 21న ముంబైలో పుట్టి, పెరిగారు. ఆమె పదమూడు ఏళ్ళ వయస్సులో నటనలో  శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఎన్నో స్టేజ్ షోలలో నటించింది. 2005 లో చాంద్ సా రోషన్ చెహ్రా అనే హిందీ మూవీ ద్వారా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత 2006లో శ్రీ మూవీ ద్వారా తెలుగు ఇండస్ట్రీలో, కేడితో తమిళ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చింది. 2007లో హ్యాపీ డేస్, కల్లూరి సినిమాలలోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు లభించింది.
ఈ రెండు సినిమాలలో తమన్నా కాలేజీ స్టూడెంట్ గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలు తమన్నాను టాలీవుడ్ మరియు కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా నిలబెట్టాయి. అప్పటి నుండి ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. తెలుగు, తమిళ, హిందీ సినిమాలలో నటిస్తూ, కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ఆమె తెలుగు, తమిళంలో స్టార్ హీరోలందరి పక్కన హీరోయిన్ గా నటించి, మెప్పించారు.
అయితే ఆమె కెరీర్ లో ఒకేఒక్క హీరో మాత్రమే తమన్నాకు హీరోగా, అన్నగా నటించారు. ఆ హీరో ఎవరంటే సుశాంత్. 2008లో కాళిదాసు మూవీతో సుశాంత్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ మూవీలో హీరోయిన్ గా తమన్నా నటించింది. ఇటీవల రిలీజ్ అయిన మెగాస్టార్ చిరంజీవి మూవీ భోళా శంకర్. ఈ మూవీలో మెగాస్టార్ పక్కన హీరోయిన్ గా తమన్నా నటించింది. అయితే ఈ మూవీలో సుశాంత్, తమన్నాకు అన్నగా నటించారు.

Also Read: ఈ అబ్బాయి తల్లితండ్రులు తెలియని తెలుగు వారు ఉండరు ఏమో..? ఎవరంటే..?