“జైలర్” లో “రజినీకాంత్ మనవడు” పాత్రలో నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

“జైలర్” లో “రజినీకాంత్ మనవడు” పాత్రలో నటించిన ఈ అబ్బాయి ఎవరో తెలుసా..?

by kavitha

Ads

సూపర్ స్టార్ రజినీకాంత్ లేటస్ట్ మూవీ జైలర్ ఇటీవల రిలీజ్ అయ్యి, బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా దూసుకుకెళ్తున్న విషయం తెలిసిందే. ‘జైలర్’ చిత్రంలో రజినీకాంత్ మొదటి నుండి చివరి దాకా హైలైట్ గా నిలిచారు. అయితే ఈ మూవీలో నటించిన ఇతర నటీనటులు కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు.

Video Advertisement

అయితే వారు ఇప్పటికే పలు చిత్రాలలో నటించినప్పటికీ, ఈ మూవీతో ఆడియెన్స్ దృష్టిని ఆకర్షించారు. దాంతో నెటిజెన్లు వారు ఎవరా? అని ఆరా తీస్తున్నారు. అలాంటి వారిలో  రజినీకాంత్ మనవడి పాత్రలో నటించిన బాల నటుడు కూడా ఉన్నాడు. మరి ఆ అబ్బాయి ఎవరో? ఇప్పుడు చూద్దాం..
జైలర్ మూవీని దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించాడు. ఈ మూవీలో ప్రధాన పాత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించగా, ఆయన భార్యగా రమ్యకృష్ణ, కొడుకుగా యంగ్ హీరో వసంత్ రవి, కోడలిగా మిర్నా మేనన్‌ నటించారు. మనవడిగా నటించిన బాలనటుడు ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాడు. దాంతో నెటిజెన్లు ఆ అబ్బాయి  ఎవరా అని నెట్టింట్లో వెతుకుతున్నారు.
ఆ బాలనటుడి పేరు రిత్విక్ అతన్ని రీతు రాక్స్ అని కూడా పిలుస్తారు. జైలర్ మూవీ కన్నా మూడు పలు సినిమాలలో రిత్విక్ నటించాడు.  అతని మొదటి సినిమా O2 (ఆక్సిజన్). ఈ మూవీలో నయనతార కుమారుడి పాత్రలో నటించాడు. ఆ తరువాత కార్తీ హీరోగా నటించిన సర్దార్ మూవీలో లైలా కొడుకుగా కీలక పాత్రలో నటించాడు. ఈ అబ్బాయికి ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. దాని ద్వారానే అతను సినిమాల్లోకి వచ్చాడు.
యూట్యూబ్ చైల్డ్ గా పాపులర్ అయిన రిత్విక్, తన యూట్యూబ్ ఛానెల్ ‘రీతు రాక్స్’ లో డిఫరెంట్ గెటప్‌లు ధరించి, నటించిన వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యాడు. ఈ ఛానెల్ ను రిత్విక్ తండ్రి జోతిరాజ్ చూసుకుంటాడు. ఆగస్ట్ 2023 నాటికి, రిత్విక్ యూట్యూబ్ ఛానెల్‌ రీతు రాక్స్ 2.36 మిలియన్ సబ్‌స్క్రైబర్‌ లు ఉన్నారు. అతని వీడియోలు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో మిలియన్ల వ్యూస్ ను సంపాదించాయి.

Also Read:  “జైలర్” సినిమాలో “రజినీకాంత్ కోడలు” పాత్రలో నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా..?


End of Article

You may also like