సినిమా అనేది ఒక కల్పిత ప్రపంచం. అందులో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి. ఒక సినిమాలో హీరో పక్కన భార్య గా నటించిన నటీమణులు, మరో చిత్రం లో చెల్లెలి గానో.. లేదా మరో పాత్ర లోనో కనిపిస్తూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం చాలా సార్లే చూసాం. పాత్ర డిమాండ్ ని బట్టి నటీనటులు నటించాలి. ఎక్కడైనా రాణించాలి అంటే ప్రొఫెషనాలిటీ చాలా ముఖ్యం. మనతో పాటు ఎవరెవరున్నారు. మనం ఎవరితో కలిసి పని చేస్తున్నాం అనేది ముఖ్యం కాదు. మన పని మనం బాగా చేయాలి అనేదే ముఖ్యం.

Video Advertisement

అయితే ఇటీవలి కాలం లో ఒక హీరోయిన్ ఒక స్టార్ హీరో చిత్రం లో అతడికి భార్య గా నటించింది.. మరో చిత్రం లో వదిన పాత్రలో కనిపించనుంది. ఆమె ఎవరో కాదు…’శృతి హాసన్’. శృతి హాసన్ ప్రస్తుతం చిరంజీవి సరసన ‘ వాల్తేరు వీరయ్య’ చిత్రంలో నటిస్తోంది. బాబీ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో రవి తేజ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు యూనిట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 

sruthi hasan in two different roles with raviteja..!!

మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కానుంది. అయితే ఈ చిత్రం లో రవి తేజ పాత్రని పరిచయం చేస్తూ ఒక టీజర్ ని కూడా రిలీజ్ చేసారు మేకర్స్. రవి తేజ ఎసిపి విక్రమ్ సాగర్ గా కనిపిస్తున్నారు. అయితే రవి తేజ ఈ చిత్రం లో చిరంజీవికి సవతి సోదరుడిగా కనిపించనున్నట్లు సమాచారం. ఇలా చూసుకుంటే రవితేజ గత చిత్రం క్రాక్ లో శృతి హాసన్ అతడికి భార్యగా నటించింది. ఇప్పుడు ఈ చిత్రం లో రవితేజ కి వదిన పాత్రలో కనిపించనుంది శృతి.

sruthi hasan in two different roles with raviteja..!!

ఇక వాల్తేరు వీరయ్య చిత్ర విషయానికి వస్తే చిరంజీవి 154వ సినిమాగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. మాస్ కమర్షియల్ అంశాలు ఫుల్లుగా ఉండేలా ఈ వాల్తేరు వీరయ్య కథ రాసుకున్నారట డైరెక్టర్ బాబీ. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో చిరంజీవి- రవితేజ మాస్ సాంగ్ కూడా ఒకటి పెట్టారట. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేములో స్టెప్పులేయబోతున్నారట. ఈ పాటకు దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలైట్ కానున్నాయని సమాచారం.