Ads
మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కథానాయకుడిగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా ‘విరూపాక్ష’ . రెగ్యులర్ కమర్షియల్ కథ కాకుండా… మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్ ఎంపిక చేసుకుని సినిమా చేయడం కలిసి వచ్చింది. తెలుగు ప్రేక్షకుల్ని సినిమా మెప్పించింది. వంద కోట్ల వసూళ్ళను రాబట్టింది.
Video Advertisement
ఈ చిత్రం లో ప్రతి ఒక్కరు అద్భుతం గా నటించారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్ తల్లి పాత్రలో నటించిన నటి ఎవరు అని అందరూ ఆరా తీస్తున్నారు. ఆ పాత్ర సినిమాలో ఉండేది కాసేపే అయినా అందరికి గుర్తుండి పోయింది సాయి కామాక్షి భాస్కర్ల.
‘ప్రియురాలు’ అనే సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కామాక్షి భాస్కర్ల ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు విరూపాక్ష మూవీ తో గుర్తింపు తెచ్చుకుంది.
కామాక్షి వృత్తిరీత్యా డాక్టర్. ఎంబీబీఎస్ చదువుతున్న సమయం లో సాయి కామాక్షి 2018వ సంవత్సరంగానూ ఫెమినా మిస్ తెలంగాణ కిరీటం అందుకుంది. ఆ తర్వాత మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. మిస్ ఇండియా 2018 పోటీల్లోనూ పాల్గొని ఫైనల్స్ వరకు చేరింది. చైనాలో మెడిసిన్ చేసిన కామాక్షి.. అపోలో హాస్పిటల్ లో కూడా కొన్నాళ్లపాటు పనిచేసింది.
ఆ తర్వాత సినీ రంగం పై మక్కువతో మోడల్ గా చేస్తూనే.. పలు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంది. ప్రియురాలు సినిమా లో హీరోయిన్ గా నటించగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో మాత్రం అక్కినేని అఖిల్ అమెరికా ఫ్రెండ్స్ బ్యాచ్ లో ఒక అమ్మాయి గా కామాక్షి కనిపించింది.
ఆ తరువాత రౌడీ బాయ్స్, మా ఊరి పొలిమేర, విరూపాక్ష చిత్రాల్లో నటించింది. ఇవే కాకుండా పలు వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది కామాక్షి.
నటన మీద ఆసక్తితో థియేటర్ ఆర్ట్ లోకి ప్రవేశించి శిక్షణ పొందిన ఆమె కథలు.. కవితలు కూడా రాస్తూ ఉంటారట. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండే కామాక్షి తన మోడలింగ్ సంబంధించిన ఫోటోలతో పాటు.. పలు హాట్ ఫోటోలు కూడా షేర్ చేస్తూ ఉంటుంది.
End of Article