“యానిమల్” లో నర్స్ గా నటించిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

“యానిమల్” లో నర్స్ గా నటించిన ఈ యాక్టర్ ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by kavitha

రణబీర్ కపూర్, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కిన ‘యానిమల్’ డిసెంబర్ 1న విడుదల అయ్యి, బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ట్రైలర్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా, మొదటి షోతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

Video Advertisement

యానిమల్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం రూ. 760 కోట్ల పైగా వసూల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో నటించిన వారందరికీ మంచి గుర్తింపు వచ్చిందని చెప్పవచ్చు. ఈ మూవీలో నర్స్ క్యారెక్టర్ లో నటించిన నటి ఎవరో ఇప్పుడు చూద్దాం..
రణబీర్ కపూర్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం యానిమల్. ఈ చిత్రంలో బాబీ డియోల్, అనిల్ కపూర్, త్రిప్తి దిమ్రి, శక్తికపూర్, బబ్లూ పృథ్విరాజ్ కీలక పాత్రలలో నటించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ సినిమా రిలీజ్ అయ్యి, సంచలన విజయం సాధిచింది. రూ. 760 కోట్ల పైగా సాధించి, పలు రికార్డులను బ్రేక్ చేసింది. ఈ మూవీలో నటించిన త్రిప్తి దిమ్రి లాంటివారికి మంచి గుర్తింపు లభించింది. ఆమె ఓవర్ నైట్ లో స్టార్ గా మారిన విషయం తెలిసిందే. ఈ మూవీలో నర్స్ పాత్రలో హిందీ సీరియల్ నటి దీప్తి పాటిల్ నటించారు.
దీప్తి పాటిల్ ముంబైలో పంజాబీ కుటుంబంలో పుట్టి పెరిగింది. ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆమె యాక్టింగ్ కెరీర్ 2018లో పాపులర్ స్టార్ ప్లస్ షో అయిన “యే హై మొహబ్బతేన్” తో ప్రారంభం అయ్యింది. ఆ షోతో బ్రేక్ రావడంతో అవకాశాలు వచ్చాయి. అలా రామన్ అకా కరణ్ పటేల్ యొక్క నర్సుగా. ఆమె సుమారు 20 ఎపిసోడ్లలో నటించింది. “యే రిష్టే హై ప్యార్ కే” ద్వారా గుర్తింపును తెచ్చుకుంది.
ఆ తరువాత దీప్తి పాటిల్ పలు పౌరాణిక మరియు క్రైమ్ షోలలో నటించింది. అలా గుర్తింపు తెచ్చుకున్న దీప్తి పాటిల్ డైరెక్టర్ సందీప్ వంగా యనిమాల్ మూవీలో రణబీర్ కపూర్, రష్మిక ఇంట్లో ఉండే నర్స్ క్యారెక్టర్ కు తీసుకున్నారు. ఈ మూవీతో  ఆమె పాపులర్ అయ్యారు. దీప్తి పాటిల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటూ, తరచూ తనకు సంబడనహించి ఫోటోలు, రీల్స్ ను షేర్ చేస్తుంటారు. ఆమెను ఇన్ స్టాగ్రామ్ లో 36 k కు పైగా ఫాలోవర్లు ఉన్నారు.

https://www.instagram.com/p/C0VURAMibxa/

Also Read: ఎవరు ఈ పక్కింటి కుర్రాడు… ఇతని అసలు పేరేంటి..? ఏ కారణంతో అరెస్టు చేశారు..?

 


You may also like

Leave a Comment