విశ్వక్ సేన్ హీరోగా విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అశోకవనంలో అర్జున కల్యాణం.  రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ గా రూపొందిన ఈ మూవీని సుధీర్ ఈదర, బి. బాపినీడు ఎస్‌విసిసి డిజిటల్ బ్యానర్‌ పై నిర్మించారు.

Video Advertisement

బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ మూవీని సమర్పించగా, రుక్సార్ ధిల్లన్, రితిక నాయక్ హీరోయిన్లుగా నటించారు. 2022లో విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో ఫోటోగ్రాఫర్ గా నటించిన యాక్టర్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్  ఈ మూవీ ముందువరకు అగ్రెసివ్ యంగ్ హీరోగా, లవర్ బాయ్ లా కనిపించారు. కానీ ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ విశ్వక్ సేన్ కనిపిస్తాడు. ఫలక్‌నుమా దాస్, రాజా వారు రాణి గారు సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన విద్యాసాగర్ చింత అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నటించిన నటీ నటుల నటన ఆడియెన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ మూవీలో ఫోటోగ్రాఫర్ గా నటించిన యాక్టర్ పేరు రాజ్‌కుమార్ కసిరెడ్డి. పలు తెలుగు సినిమాలలో నటించారు.  రాజ్‌కుమార్ 1992లో  జనవరి 12న జన్మించారు. నటన పై ఉన్న ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రాజ్‌కుమార్ కెరీర్ 2019 లో రాజా వారు రాణి గారు మూవీతో ప్రారంభం అయ్యింది. ఈ మూవీలో చౌదరి క్యారెక్టర్ లో నటించి, గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తరువాత ఫలక్‌నుమా దాస్ లో నటించారు.
ఆ తరువాత  వరుసగా అవకాశాలు వచ్చాయి. అలా రాజ్‌కుమార్ బ్లడీమేరీ, రంగరంగ వైభవంగా, స్టాండప్ రాహుల్, అర్జున ఫల్గుణ, సీతా రామం, చిత్తం మహారాణి, బెదురులంక 2012, రంగబలి వంటి సినిమాలలో నటించి, అలరించారు. సైమా 2023 అవార్డ్స్ లో ఉత్తమ కామెడీ నటుడు కేటగిరీలో రాజ్‌కుమార్ కసిరెడ్డి అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాకి నామినేట్ అయ్యారు. దుల్కర్ సల్మాన్ నటించబోయే లక్కీ భాస్కర్ మూవీలో కూడా నటిస్తున్నారు.

Also Read:  “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” ఎన్నో సార్లు చూసినా…కానీ 6 డౌట్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి..!