Ads
ఆర్ఎక్స్ 100 డైరెక్టర్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘మంగళవారం’. తనకు మొదటి విజయాన్ని హీరోయిన్ పాయల్ తో మరో విజయాన్ని అజయ్ భూపతి అందుకున్నారు. సైకలాజికల్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర విజయాన్ని అందుకుంది.
Video Advertisement
ఈ చిత్రం వసూళ్లతో పాటుగా, విమర్శకుల ప్రశంసలను కూడా అందుకుంది. నవంబర్ లో థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చింది. ఈ సినిమాలో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు లభించింది. వీరిలో కాశిరాజు అసిస్టెంట్ గా నటించిన నటుడు కూడా ఉన్నారు. అతనెవరో ఇప్పుడు చూద్దాం..
తొలి చిత్రంతోనే నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటించి, అందరినీ తన వైపుకు తిప్పుకున్న పాయల్ రాజ్ పుత్, ఆర్ఎక్స్ 100 మూవీతో ఓవర్ నైట్ స్టార్ గా మారింది. గ్లామర్ మరియు నటనతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు అంతగా విజయాలు అందుకోలేదు. తనకు హిట్ ఇచ్చిన అజయ్ భూపతి దర్శకత్వంలో మంగళవారం మూవీలో నటించి, హిట్ అందుకున్నారు. నవంబర్ 17 న రిలీజ్ అయిన ఈ చిత్రం మంచి వసూళ్లను సాధించింది. రీసెంట్ గా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమింగ్ అవుతుంది.
ఈ చిత్రంలో నటించిన నటీనటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. మంచి గుర్తింపు తెచ్చుకుని పాపులర్ అయ్యారు. వారిలో మీసాల లక్ష్మణ్ ఒకరు. ఈ చిత్రంలో కాశిరాజు అసిస్టెంట్ పులి ‘గుడ్డోడు’ పాత్రలో లక్ష్మణ్ నటించారు. లక్ష్మణ్ రంగస్థల మరియు సినీ నటుడు. లక్ష్మణ్ 1984 ఆగస్టు 12న జన్మించాడు. 2007లో హైదరాబాద్ కు వచ్చి డి.యస్. దీక్షితులు వద్ద నటనలో శిక్షణ పొంది, ‘అమ్మా నాకు బ్రతకాలని ఉంది’ అనే నాటకం నాటకరంగంలోకి అడుగుపెట్టాడు.
అలా అనేక పౌరాణిక, సాంఘిక నాటకాల్లో నటించిన లక్ష్మణ్ ‘కో అంటే కోటి’ మూవీ ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చాడు. పలు సినిమాలలో నటించిన లక్ష్మణ్ హితుడు, మనమంతా, వంగవీటి, ఘాజీ, ఆర్‌ఎక్స్ 100 చిత్రాల ద్వారా గుర్తింపు పొందాడు. మంగళవారం మూవీతో పాపులర్ అయ్యారు. లక్ష్మణ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా, జైలర్ మూవీలోని పాపులర్ డైలాగ్ వార్త వర్మ నటుడికి లక్ష్మణ్ డబ్బింగ్ చెప్పారు.
https://www.instagram.com/reel/C1T-VPbvuba/?igsh=NjZiM2M3MzIxNA%3D%3D
Also Read: BUBBLEGUM REVIEW: “రోషన్ కనకాల” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!
End of Article