BUBBLEGUM REVIEW: “రోషన్ కనకాల” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

BUBBLEGUM REVIEW: “రోషన్ కనకాల” హీరోగా నటించిన ఈ సినిమా ఎలా ఉంది..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!

by Mohana Priya

Ads

ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా పరిచయం అవుతూ వచ్చిన బబుల్‌గమ్ సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

  • చిత్రం : బబుల్‌గమ్
  • నటీనటులు : రోషన్ కనకాల, మానస చౌదరి, వైవా హర్ష, అను హాసన్.
  • నిర్మాత : మహేశ్వరి మూవీస్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
  • దర్శకుడు : రవికాంత్ పేరేపు
  • సంగీతం : శ్రీ చరణ్ పాకాల
  • విడుదల తేదీ : డిసెంబర్ 29, 2023

bubblegum movie review

స్టోరీ:

ఆదిత్య అలియాస్ ఆది (రోషన్ కనకాల) హైదరాబాద్ లో నివసించే ఒక సాధారణమైన కుటుంబానికి చెందిన అబ్బాయి. ఎప్పటికైనా సరే ఆదికి డీజే అయ్యి గుర్తింపు తెచ్చుకోవాలి అనే ఆశయం ఉంటుంది. దాని కోసం ఒక ప్రముఖ డీజే దగ్గర అసిస్టెంట్ గా చేరతాడు. మరొక పక్క జాన్వి అలియాస్ జాను (మానస చౌదరి) చదువుల కోసం అమెరికాకి వెళ్దాం అనుకుంటుంది. అంతలోపు టైం పాస్ కోసం ఇక్కడ ఆదిని ఇష్టపడుతున్నాను అని చెప్తుంది. కానీ ఆది మాత్రం జానుని నిజంగానే ఇష్టపడతాడు. జాను కూడా తెలియకుండా ఆదితో ప్రేమలో పడిపోతుంది.

bubblegum movie review

అయితే ఒక రోజు జాను ఒక పార్టీలో తన మాజీ బాయ్ ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉంటుంది. ఇది చూసిన ఆది బాధపడుతూ ఉన్నప్పుడు జాను స్నేహితురాలు ధరణి వచ్చి ఆదితో క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. ఇదంతా చూసిన జాను కోపం తెచ్చుకొని ఆదిని తిడుతుంది. తాను లేకపోతే అసలు ఆదికి ఈ స్టేటస్ అంతా వచ్చేది కాదు అన్నట్టు మాట్లాడుతుంది. దాంతో ఆదికి కోపం వస్తుంది. అప్పుడు ఆది ఏం చేశాడు? జానుకి బుద్ధి చెప్పాడా? తాను అనుకున్నట్టుగానే పెద్ద డీజే అయ్యాడా? వీరి ప్రేమ కథ ఏం అయ్యింది? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

bubblegum movie review

రివ్యూ:

ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి, ఒక రిచ్ అమ్మాయి, వాళ్ళు అనుకోకుండా కలవడం, ఆ తర్వాత ప్రేమించుకోవడం, గొడవలు అవ్వడం. ఇలాంటి టెంప్లేట్ ఉన్న సినిమాలు మనం చాలా చూశాం. అసలు ఒక రకంగా చెప్పాలి అంటే ఇది చాలా సంవత్సరాల నుండి వస్తున్న ఒక కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ ని చాలా మంది దర్శకులు తమ స్టైల్ లో మార్చి తీశారు. ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ మీద మరొక సినిమా వచ్చింది. బబుల్‌గమ్ సినిమా కథ పరంగా చూస్తే చాలా తెలిసిన కథ ఉన్న సినిమా. సినిమా చూస్తూ ఉంటే నెక్స్ట్ ఏమవుతుంది అనేది ఎవరైనా చెప్పేస్తారు.

bubblegum movie review

కానీ ఈ తరానికి తగ్గట్టు కొన్ని మార్పులు చేశారు అంతే. దర్శకుడు రవికాంత్ అంతకుముందు క్షణం, కృష్ణ అండ్ హిస్ లీల సినిమాలకి దర్శకత్వం వహించారు. క్షణం సినిమా సైలెంట్ గా వచ్చి హిట్ అయితే, కృష్ణ అండ్ హిస్ లీల సినిమా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా అని గుర్తింపు తెచ్చుకుంది. ఈ రెండు సినిమాలతో పోల్చి చూస్తే ఇప్పుడు వచ్చిన బబుల్‌గమ్ సినిమాలో కాన్సెప్ట్ కొంచెం వీక్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. క్లైమాక్స్ మాత్రం కాస్త కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది.

bubblegum movie review

కానీ మిగిలిన సినిమా అంతా చాలా చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మొదటి సినిమా అయినా కూడా రోషన్ కనకాల చాలా బాగా చేశారు. అతని పర్ఫార్మెన్స్ చూస్తూ ఉంటే సినిమా కోసం కష్టపడ్డారు అని అర్థం అవుతూ ఉంటుంది. హీరోయిన్ మానస చౌదరి గ్లామరస్ గా కనిపించారు. కానీ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం ఇంకా కొంచెం మెరుగుపరుచుకోవాల్సి ఉంది. హీరో స్నేహితుడుగా వైవా హర్ష కూడా కామెడీ చేశారు.

bubblegum movie review

సినిమాకి హైలైట్ అయిన మరొక పాత్ర హీరో తండ్రి పాత్ర. ఈ పాత్రలో నటించిన చైతు జొన్నలగడ్డ కూడా చాలా బాగా నటించారు. శ్రీ చరణ్ పాకాల అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ అంతా కూడా చాలా స్లోగా నడుస్తుంది. కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. అయినా కూడా చాలా చోట్ల సాగదీసినట్టు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సెకండ్ హాఫ్ చాలా బెటర్ గా ఉంది. అయినా కూడా చాలా తెలిసిపోయే కథ కావడంతో ప్రేక్షకులకి నెక్స్ట్ ఏమవుతుంది అనేది అర్థం అవుతుంది. కథనం విషయంలో ఇంకా కొంచెం జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది ఏమో అనిపిస్తుంది.

ప్లస్ పాయింట్స్:

  • నటీనటుల పర్ఫార్మెన్స్
  • పాటలు
  • క్లైమాక్స్
  • కొన్ని కామెడీ సీన్స్

మైనస్ పాయింట్స్:

  • బాగా తెలిసిన కథ
  • సాగదీసినట్టుగా ఉన్న సీన్స్

రేటింగ్ :

2.5/5

ట్యాగ్ లైన్:

పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా, దర్శకుడు ముందు సినిమాలతో పోల్చకుండా, అసలు రోషన్ కనకాల ఎలా చేశాడు అని చూద్దాం అనుకునే వారికి, రొటీన్ కథ అయినా పర్వాలేదు, సాగదీసినట్టుగా ఉన్నా పర్వాలేదు. అసలు టేకింగ్ ఎలా ఉంది అని తెలుసుకుందామని అనుకునే వారికి బబుల్‌గమ్ సినిమా ఒక్కసారి చూడగలిగే యావరేజ్ సినిమాగా నిలుస్తుంది.

watch trailer :

ALSO READ : 17 ఏళ్ళ క్రితం వచ్చిన సినిమా ఇప్పుడు ఎందుకు ట్రెండ్ అవుతుంది.. ఆ ఇద్దరే కారణమా..?


End of Article

You may also like