Ads
ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ రీసెంట్ గా మరణించిన విషయం తెలిసిందే. ఆయన మరణించిన తరువాత రాకేష్ మాస్టర్ గురించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాదాపు 1500 సినిమాలకు కొరియోగ్రఫర్ గా పనిచేసిన ఆయన ఎన్నో విజయాలను అందుకున్నారు.
Video Advertisement
రాకేష్ మాస్టర్ కెరీర్ పరంగా విజయం సాధించిన ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసారు. అందరు ఉన్నా రాకేష్ మాస్టర్ ఆఖరి రోజులలో అనాధ ఆశ్రమంలో జీవించారు. అనారోగ్య సమస్యలతో గాంధీ ఆస్పత్రిలో చేరిన ఆయన అక్కడే కన్నుమూశారు. తాజాగా ఆయనకు కెరీర్ ను ఇచ్చిన హీరో గురించి నెట్టింట్లో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం..
రాకేష్ మాస్టర్ తనకు కెరీర్ ను ఇచ్చిన హీరో గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆయనే స్వయంగా చెప్పారు. అవి ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆయన ఇండస్ట్రీలో ఛాన్స్ కోసం వెతుకుతున్న టైంలో ఒక హీరో వల్ల కెరీర్ ఉన్నత స్థాయికి చేరుకుందని, ఆయన లేకపోతే తనకు లైఫ్ ఉండేది కాదని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. ఆ హీరో వేణు తొట్టెంపూడి. ఒక ఇంటర్వ్యూ లో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ “నా లైఫ్ లో చాలా కష్టాలు పడ్డానని, ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎందరి దగ్గరికో తిరిగానని, అలాంటి టైంలో వేణు సార్ పిలిచి మరీ నాకు ఛాన్స్ ఇచ్చారు” అని అన్నారు.
వేణు హీరోగా నటించిన ‘చిరునవ్వుతో’ మూవీలో “నిన్నలా మొన్నలా లేదురా” అనే సాంగ్ కు కొరియోగ్రఫర్ గా పని చేశానని రాకేష్ మాస్టర్ వెల్లడించారు. చిరునవ్వుతో సినిమానే రాకేష్ మాస్టర్ కు కొరియోగ్రఫర్ గా తొలి సినిమా. వేణు సార్ వల్లే తన లైఫ్ గొప్పగా మారిందని రాకేష్ మాస్టర్ అన్నారు. కాగా రాకేష్ మాస్టర్ సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read: “రాకేష్ మాస్టర్” తండ్రి ఎంత గొప్పవారో తెలుసా..? అప్పట్లోనే ఇంత ఆలోచించారా..?
End of Article