చూడటానికి అచ్చం “మహేష్ బాబు” లాగే ఉన్నాడు కదా..? ఇంతకీ ఇతను ఎవరో తెలుసా..?

చూడటానికి అచ్చం “మహేష్ బాబు” లాగే ఉన్నాడు కదా..? ఇంతకీ ఇతను ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. ఇప్పటికి చాలా సినిమాల్లో నటించి పాపులర్ అయిపోయారు. సూపర్ స్టార్ కృష్ణ గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకుని మహేష్ బాబు తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ తో ముందుకెళ్ళిపోతున్నారు.

Video Advertisement

ఇండస్ట్రీ ని రూల్ చేస్తున్న హీరోల లో సూపర్ స్టార్ మహేష్ బాబు నెంబర్ వన్ అని చెప్పొచ్చు. గత సంవత్సరం సర్కారు వారి పాట సినిమాతో ప్రేక్షకులు ముందుకి వచ్చారు ఇప్పుడు ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నారు.

reasons for mahesh babu become super star..!!

వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు ఇప్పటికే వచ్చాయి. దీనితో ఆ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. అలానే దర్శక రాజమౌళితో కూడా మహేష్ బాబు ఒక సినిమాని చేయబోతున్నారని వార్తలు వచ్చాయి. మరి ఎప్పుడు సినిమా వస్తుందనేది తెలీదు. మనిషిని పోలిన మనుషులు ఉంటారు అన్న విషయం మనకి తెలిసిందే. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని కూడా అంటారు. అయితే మన టాలీవుడ్ లోనే సమంత లాగా అషు రెడ్డి ఉంటుంది.

ఆమెని జూనియర్ సమంత అని పిలుస్తూ ఉంటాము. అయితే మహేష్ బాబు లాగ ఒక వ్యక్తి చూడడానికి ఉంటారు అతను ఎవరో కాదు అబ్రామ్ పాండే. అచ్చం మహేష్ బాబు లాగ కనపడతాడు పొరపాటున చూస్తే మహేష్ బాబు అని అనుకుంటాము. అబ్రామ్ పాండే కూడా యాక్టర్ ఏ. బడే దూర్ సే అయి హై, కిచిడీ రిటర్న్స్, శ్రీమాన్ శ్రీమతి ఫిర్ సే వంటి వాటిలో నటించాడు.  చూసేందుకు మహేష్ బాబు లాగే ఉంటాడు అబ్రహం. ఫన్నీ క్యారెక్టర్స్ లో నటిస్తూ యాక్టింగ్ కెరీర్ ని మొదలు పెట్టాడు అబ్రహం. ప్రేక్షకులకి అతని నటన నచ్చింది.

కామెడీ చేస్తుంటే నాకు కూడా నచ్చిందని తను తన కెరీర్ ని స్టార్ట్ చేశారు. షూటింగ్లో పాల్గొనడం కూడా నాకు నచ్చింది అని అబ్రామ్ చెప్పారు. అందరూ తనని మహేష్ బాబు తో పోలుస్తారని నిజానికి అది ఒక మంచి కాంప్లిమెంట్ అని చెప్పారు. అలానే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు కోసం చూస్తున్నానని.. సూపర్ స్టార్ వంటి వారితో ఎప్పుడూ కంపేర్ చేసుకోవాలని అనుకోలేదని చెప్పారు.


End of Article

You may also like