శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ సినిమా “పెద కాపు” స్టోరీ ఏంటి..? ఈ హీరో ఎవరు..?

శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ సినిమా “పెద కాపు” స్టోరీ ఏంటి..? ఈ హీరో ఎవరు..?

by kavitha

Ads

తెలుగు ఇండస్ట్రీలో తనదైన శైలిలో కుటుంబ కథ చిత్రాలను తెరకెక్కించడంలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను  ఏర్పరుచుకున్న డైరెక్టర్లలో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. చాలా కాలం తరువాత ప్రస్తుతం ‘అఖండ’ యూనిట్ తో ఒక చిత్రాన్ని చేస్తున్నారు. ఈ మధ్యే ఈ చిత్రం గురించి అధికారికంగా ప్రకటించారు.

Video Advertisement

తాజాగా ఈ చిత్రానికి ‘పెద్ద కాపు’ అనే టైటిల్ ను ఫైనల్ చేసి, ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ ను రిలీజ్ చేశారు. ‘అఖండ’ లాంటి బ్లాక్ బస్టర్ విజయం తరువాత మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తన బ్యానర్ ద్వారక క్రియేషన్స్ పై నిర్మిస్తున్నారు. దాంతో ఈ మూవీ పై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ పెద్ద కాపు కథ ఏమిటో? ఈ మూవీలో హీరో ఎవరో ఇప్పుడు చూద్దాం.. మొదటి నుండి ఫ్యామిలీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించిన శ్రీకాంత్ అడ్డాల గత కొన్నేళ్ళ నుండి విజయం కోసం ఎదురుచూస్తున్నారు. చాలా గ్యాప్ తరువాత శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. జయజానకి నాయక, అఖండ లాంటి సినిమాల నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి తన మేనల్లుడు విరాట్ కర్ణను ఈ మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా పరిచయం చేస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుండి ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ రిలీజ్ అయ్యింది. ఇది ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది. ఈ పోస్టర్ లో హీరో విరాట్ కర్ణ మాస్ లుక్‌ తో కనిపించాడు. అదే కాకుండా విరాట్ ఊరులోని ఓ వర్గానికి నాయకుడిగా కనిపిస్తున్నాడు. ఇక ఈ పోస్టర్ పై ‘ఓ సామాన్యుడి సంతకం’ క్యాప్షన్ కనిపిస్తోంది. దీంతో మూవీ ప్రారంభంలోనే పోస్టర్ అందరిని ఆకర్షించింది. ఈ మూవీ కోనసీమలో 1980ల నేపథ్యంలో సాగే కథ అని సమాచారం. ఆ సమయంలో అక్కడ జరిగిన రాజకీయాలు, కులాల, వర్గ పోరాటాలు, గొడవల చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందని తెలుస్తుంది.

Also Read: ఆ ఒక్క మాట అడిగినందుకు”కృష్ణ”ను స్టూడియో మొత్తం తిప్పించిన మహేష్ బాబు.. అసలేమైందంటే?


End of Article

You may also like