టాలీవుడ్ లో మొదటి సారిగా ఈస్ట్ మన్ కలర్  పరిచయం చేసిన నటుడు కృష్ణ. ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలను రూపొందిస్తూ నెంబర్ వన్ గా నిలిచారు. కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ లోకి యువరాజు చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు మన సూపర్ స్టార్ మహేష్ బాబు. నటనలో తండ్రిని మించిన తనయుడు గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Video Advertisement

మే నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఆమె కుమార్తె అయిన మంజుల  ఒక ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు కృష్ణ.

Krishna and mahesh babu

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా మహేష్ బాబు టాలీవుడ్ లో అగ్ర హీరోగా కొనసాగుతున్నారు. ఆ ఇంటర్వ్యూలో మహేష్ ను మీరు చిన్న వయసులోనే సూపర్ స్టార్ గా రూపుదిద్దారు. ఇలా మహేష్ ను సినిమాల్లోకి అనుకోని తీసుకువచ్చారా  లేక ఏదైనా కారణం వల్ల అలా జరిగిపోయిందా అని మంజుల ప్రశ్నించగా, దీనిపై స్పందిస్తూ కృష్ణ మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

Mahesh childhood photos

చిన్న వయస్సు నుంచి మహేష్ బాబును నావెంట షూటింగ్ లోకి తీసుకెళ్లేవాడిని. షూటింగ్ జరుగుతున్న సమయంలో మహేష్ ఒక మూలన కూర్చుని అంత గమనించేవారు. నేను తన దగ్గరకి వెళ్లి నువ్వు సినిమాలో నటిస్తావా అని అడగగా, చేయమని మారాం చేశాడు.

Mahesh childhood photo with Krishna

సినిమాలో చేస్తావా? చేయవా? అని నేను అనగానే  మహేష్ లేచి స్టూడియో మొత్తం పరుగులు పెడుతూ నన్ను తిప్పలు పెట్టాడు అని కృష్ణ మంజుల ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.