“కుమారి శ్రీమతి” ట్రైలర్‌లో.. “నిత్యా మీనన్, గౌతమి” తో పాటు కనిపించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

“కుమారి శ్రీమతి” ట్రైలర్‌లో.. “నిత్యా మీనన్, గౌతమి” తో పాటు కనిపించిన ఈ హీరోయిన్ ఎవరో తెలుసా..?

by kavitha

Ads

స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ లీడ్ రోల్ లో నటిస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ ‘కుమారి శ్రీమతి’. తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. 2.11 నిమిషాల నిడివితో ఉన్న ఈ టీజర్ మంచి రెస్పాన్స్ వస్తోంది. టైటిల్ లాగే ట్రైలర్‌ కూడా డిఫరెంట్ గా ఉంది. ఎప్పటిలానే నిత్యామీనన్ తన నటనతో ఆకట్టుకుంది.

Video Advertisement

గౌతమి, కార్తీక దీపం సీరియల్ ఫేమ్ నిరుపమ్ పరిటాల, తిరువీర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ లో సెప్టెంబర్ 28 నుండి స్ట్రీమింగ్ కానుంది. అయితే ఈ టీజర్ లో నిత్యామీనన్, గౌతమి పాటు ఒక సీనియర్ హీరోయిన్ కనిపించింది. ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
నిత్యామీనన్ నటించిన కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ ను ప్రముఖ ప్రొడక్షన్ హౌజ్ వైజయంతి మూవీస్ మరియు  స్వప్న సినిమాస్ కలిసి నిర్మించాయి. ఈ సిరీస్ కు గోమఠేష్ ఉపాధ్యాయ డైరెక్షన్ చేయగా, యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాస్ అవసరాల ఈ సిరీస్ కు స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. దీనిని తెలుగులోనే కాకుండా తమిళ్, మళయాల, హిందీ భాషల్లో కూడా  స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ప్రమోషన్ లో భాగంగా తాజాగా ట్రైలర్‌ రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ లో నిత్యామీనన్, గౌతమితో పాటు ఒక సీనియర్ నటి కనిపించారు. ఆమె ఎవరో కాదు తాళ్లూరి రామేశ్వరి. తెలుగు, హిందీ, ఒడియా, మలయాళ భాషలలో పలు సినిమాలలో నటించి, ఆకట్టుకున్నారు. రామేశ్వరి 1977లో మొదటిసారి ‘దుల్హన్ వహీ జో పియా మాన్ భాయే’ మూవీలో నటించింది. ఆమెకు పెద్ద బ్రేక్ వచ్చింది. ఆ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో పెద్ద బ్రేక్ వచ్చింది. వరుస అవకాశాలు వచ్చాయి.
తెలుగులో 1978 లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో సీతామాలక్ష్మి హీరోయిన్ గా ఎంట్రీ నటించింది. ఈ మూవీకి ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అందుకుంది. వివాహం తరువాత సినిమాలకు దూరం అయ్యింది. రీ ఎంట్రీలో మహేష్ బాబు హీరోగా నటించి నిజం మూవీలో తల్లిగా నటించింది. ఆ తరువాత పలు సీరియల్స్ నటించింది. తాజాగా కుమారి శ్రీమతి వెబ్ సిరీస్ లో నిత్యామీనన్ నానమ్మగా కనిపించింది.

Also Read: “కాంతార” లాంటి కథతో వచ్చిన డైరెక్ట్ “తెలుగు” సినిమాని ఫ్లాప్ చేసి… డబ్బింగ్ సినిమాని హిట్ చేశారు..! ఆ తెలుగు సినిమా ఏదంటే..?

 


End of Article

You may also like