“యానిమల్” సినిమాలో బాబీ డియోల్ రెండో భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.? తల్లితండ్రులు ఇద్దరు నటులే.!

“యానిమల్” సినిమాలో బాబీ డియోల్ రెండో భార్య బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా.? తల్లితండ్రులు ఇద్దరు నటులే.!

by Mounika Singaluri

సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక మందన, త్రిప్తి, అనిల్ కపూర్, బాబీ డియోల్ తదితరులు నటించిన మూవీ యానిమల్. ఇది సెన్సేషనల్ హిట్ అయి బాలీవుడ్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. అయితే ఈ మూవీలో రణబీర్ కపూర్ అగ్రెసివ్ పాత్రలో నటించారు. రణబీర్ కి విలన్ గా బాబి డియోల్ అద్భుతమైన నటన కనబరిచారు. సినిమాలో ఒక్క డైలాగ్ లేకపోయినా కూడా తన కళ్ళతోటి హవభావాలను ప్రకటించిన తీరు అయితే అమోఘం. అయితే ఈ సినిమాలో బాబి డియోల్ కు ముగ్గురు భార్యలు ఉంటారు. అయితే ఇందులో బాబీ డియోల్ సెకండ్ వైఫ్ గా నటించిన ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో మీకు తెలుసా…?

Video Advertisement

యానిమల్ సినిమాలో బాబి డియోల్ పాత్ర పేరు అబ్రర్. ముస్లిం కుటుంబానికి చెందిన వ్యక్తిగా అబ్రర్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటాడు. అయితే ఇందులో అబ్రర్ రెండో భార్యగా నటించిన ఆమె కనిపించింది కొద్దిసేపైనా కూడా మంచి నటన కనబరిచింది. అబ్రర్ మిగతా భార్యలతో కలిసి వచ్చే సన్నివేశాలు, క్లైమాక్స్ లో వచ్చేసి సీన్స్ లో తన నటన అద్భుతంగా ఉంది. అయితే ఆమె ఎవరు అంటూ చాలామంది ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తున్నారు. ఆమె లండన్ కి చెందిన పాకిస్తానీ నటి షఫీనా షా..!

షఫీనా తల్లిదండ్రులు ఇద్దరు కూడా నటులే. షఫీనా తల్లి అతియ షా పాకిస్థాన్ లోని కోహట్ లో జన్మించారు. షఫీనా తండ్రి రాజ్ పటేల్ ఇండియాలోని బూట్ వాడకు చెందిన వ్యక్తి. తల్లిదండ్రులు ఇద్దరు కూడా లండన్ కి వెళ్ళిపోయి అక్కడ నటీనటులుగా ఉండేవారు. అక్కడే వారికి పరిచయం అవ్వడం, షహీనా కూడా లండన్ లోనే జన్మించడం జరిగింది. తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని షహీనా కూడా నటనవైపు మళ్ళీంది.పాకిస్తానీ ఫిలిం లాహోర్ టు లండన్ అనే సినిమాలో నటించింది. షారుక్ ఖాన్ తో కలిసి ఒక యాడ్ లో కూడా కనిపించింది. 2023 లో మిస్ క్రౌన్ పాకిస్తానీ టైటిల్ కూడా గెలుచుకుంది.


You may also like

Leave a Comment