Ads
దేశవ్యాప్తంగా సినీ ప్రియులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆదిపురుష్ వచ్చేసింది. ఈ సినిమా దేశవ్యాప్తంగా విడుదల అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో నడుస్తోంది.
Video Advertisement
ఇందులో రాముడిగా ప్రభాస్ కనిపించగా.. సైఫ్ అలీఖాన్ రావణుడిగా.. సీత పాత్రలో కృతి సనన్ కనిపించింది. అయితే వీరి ముగ్గురి గురించి ప్రేక్షకుల గతంలోనే తెలుసు. అలాగే వీరంతా సుపరిచితం కావడంతో ఆడియన్స్ సైతం వీరి నటన పై అవగాహన ఉంది.
అయితే ఆదిపురుష్ లో హనుమంతుడు స్పెషల్ అట్రాక్షన్ అయ్యాడు. ఇప్పటివరకు కేవలం ప్రధాన పాత్రలను మాత్రమే పరిచయం చేసిన డైరెక్టర్ ఓం రౌత్.. హనుమంతుడి పాత్రలో ఎవరు నటిస్తున్నారనేది చెప్పలేదు. ఇక తాజాగా విడుదలైన సినిమాలో హనుమంతుడిగా కనిపించింది ఎవరా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది.
హనుమంతుడిగా కనిపించిన అతడి పేరు దేవదత్త గజానన్ నాగే. మరాఠీ సీరియల్స్.. సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా జై మల్హర్ సీరియల్లో లార్డ్ కండోబా పాత్రలో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అలాగే వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ చిత్రాల్లో నటించారు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఆదిపురుష్ చిత్రంలో కీలకపాత్రలో కనిపించనున్నాడు. ఇక లేటేస్ట్ టాక్ ప్రకారం ఈ మూవీలో అతని పాత్ర మరింత కీలకంగా ఉండనుందట.
దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన తాన్హాజీ.. ది అన్ సంగ్ వారియర్ చిత్రంలో సూర్యాజీ మలుసరే పాత్రలో నటించారు. “నాకు హనుమంతుడితో ప్రత్యేక అనుబంధం ఉంది.. 17 ఏళ్ల వయసులో వర్కవుట్ చేయడం ప్రారంభించా…. నా తొలి జిమ్ సెంటర్ కు హనుమాన్ వ్యాయమశాల అని పేరు పెట్టాను.” అని దేవదత్త గజానన్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఆదిపురుష్ చిత్రంలో హనుమంతుడిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. తన పాత్ర కోసం శరీరాకృతిని పూర్తిగా మార్చుకున్నట్లు ఆయన వెల్లడించారు.. ఆదిపురుష్ సినిమా ద్వారా, ప్రభాస్, సన్నీ సింగ్, కృతి సనన్ తనకు మంచి స్నేహితులు అయ్యారని చెప్పుకొచ్చారు దేవదత్తా.
End of Article