కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ మూవీ 2015 లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ మూవీ సెన్సేషనల్ హిట్ అయ్యి, బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ మూవీ తమిళంలో 2014 లో ‘వేలై ఇల్లా పట్టదారి’ విడుదల అయింది.

Video Advertisement

అక్కడ బ్లాక్ బస్టర్ అవడంతో తెలుగులో ‘రఘువరన్ బీటెక్’ టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమాతోనే ధనుష్  తెలుగులో మార్కెట్ ఏర్పరచుకున్నాడు. ఇటీవల టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ నేపథ్యంలో ఈ మూవీని కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ మూవీలో ధనుష్ తమ్ముడు కార్తీక్ గా నటించిన నటుడు ఎవరో? ఇప్పుడు చూద్దాం.. కోలీవుడ్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన ‘రఘువరన్ బీటెక్’ మూవీ తెలుగులో కూడా బ్లాక్‍బాస్టర్ గా నిలిచింది. నిరుద్యోగి కష్టాలు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండే అనుబంధాలు, హీరో కెరీర్ లో ఎదిగే విధానంతో పాటు, డైలాగ్స్, సాంగ్స్, ఇలా అన్ని అంశాలు ‘రఘువరన్ బి.టెక్’ ను యూత్‍కు కనెక్ట్ అయ్యేలా చేసింది. ఎవర్ గ్రీన్ మూవీగా నిలిచింది. రిలీజ్ అయిన ఎనిమిదేళ్ళ తరువాత ఈ మూవీ తాజాగా రీరిలీజ్ అవగా ఈ చిత్రానికి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది.
యూత్ థియేటర్లో ఒక పాటకు పాట పాడుతూ హోరెత్తించారు. వారి పాటతో థియేటర్ మార్మోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‍ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈ మూవీలో ధనుష్ తమ్ముడు కార్తీక్ గా నటించిన నటుడు కూడా ఆకట్టుకున్నాడు. అతని పేరు హృషికేశ్. ఇతను ధనుష్ కు బావమరిది అవుతాడని తెలుస్తోంది. అలాగే మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ కి బంధువు.
హృషికేశ్ పీస్బిబి స్కూల్ లో ప్రాధమిక విద్యను పూర్తి చేశారు. మద్రాస్ యూనివర్సిటీ లో  విజువల్ కమ్యూనికేషన్‌ను అభ్యసించారు. ఆ తర్వాత హృషికేశ్ యాడ్స్, డాక్యుమెంటరీలలో పని చేశారు. ‘వేలై ఇల్లా పట్టదారి’ మూవీలో ధనుష్ తమ్ముడి పాత్రలో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. ఆ తరువాత రమ్ అనే మూవీలో లీడ్ రోల్ లో నటించారు. ఆమూవీ తరువాత వీఐపీ 2, పెద్దన్న, బొమ్మలకొలువు అనే తెలుగు సినిమాలోనూ నటించాడు.

Also Read:  అసలు పాడినవారికంటే…కోరస్ పాడిన అమ్మాయికి ఫిదా అంటూ కామెంట్స్.! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.?