ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?

ఈ 12 మంది ఇప్పుడు స్టార్స్…కానీ ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్స్ చేసారని మీకు తెలుసా.?

by Mohana Priya

Ads

కెరియర్ లో ముందుకు వెళ్లాలంటే ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాల్సిందే. ఇవాళ ఇండస్ట్రీలో ఎంతో పేరు తెచ్చుకున్న కొంత మంది యాక్టర్స్ కూడా ఏదో ఒక రోల్ తో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. మరి మొదటి సినిమాలో క్రెడిట్ లేని పాత్రలో గానీ సైడ్ రోల్స్ లో కానీ కనిపించి తర్వాత మెల్లగా లీడ్ రోల్ ప్లే చేసే స్థాయికి ఎదిగారు. అలా లీడ్ రోల్స్  చేసే ముందు సైడ్ రోల్స్ లో కనిపించిన కొంతమంది నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 సాయి పల్లవి

సాయి పల్లవి తమిళ్ లో జయం రవి, కంగనా రనౌత్ హీరో హీరోయిన్లుగా నటించిన  ధామ్ ధూమ్ అనే సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. అలాగే కస్తూరిమాన్ అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపిస్తారు.

Actor who started their careers with side roles

#2 కాజల్ అగర్వాల్

కాజల్ క్యూ హో గయా నా అనే సినిమాలో ఐశ్వర్యరాయ్ ఫ్రెండ్ గా నటించారు.

Actor who started their careers with side roles

kajal in kyun ho gaya na

#3 త్రిష

త్రిష జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్ గా నటించారు.

Actor who started their careers with side roles

trisha in jodi

#4 సిద్ధార్థ్

బాయ్స్ సినిమాతో హీరోగా తన కెరీర్ మొదలు పెట్టిన సిద్ధార్థ్ అంతకుముందు మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన కన్నతిల్ ముతమిట్టల్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాని తెలుగులో అమృత పేరుతో డబ్ చేశారు. ఇది అన్ క్రెడిటెడ్ రోల్.

Actor who started their careers with side roles

siddharth in amrutha

#5 కార్తీ

తమిళ్ హీరో అయినా కూడా కార్తీకి మన తెలుగులో కూడా చాలా మంచి క్రేజ్ ఉంది. అందుకే కార్తీ నటించిన దాదాపు అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదల అవుతాయి. అయితే కార్తీ అంతకుముందు మణిరత్నం గారి దర్శకత్వంలో వచ్చిన యువ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు. సిద్ధార్థ్ కి కుడివైపు కార్తీ ఉంటారు. సిద్ధార్థ్ కి ఎడమ వైపు ఉన్న ఆవిడ సారొస్తారా వంటి ఎన్నో పాటలతో ఎంతో పేరు తెచ్చుకున్న సింగర్ సుచిత్ర.

Actor who started their careers with side roles

karthi in yuva

#6 అనసూయ

జబర్దస్త్ షో తో పాటు, ఎన్నో సినిమాల్లో కూడా నటిస్తున్న అనసూయ అంతకు ముందు జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నాగ సినిమా లో ఒక చిన్న రోల్ లో కనిపిస్తారు.

Actor who started their careers with side roles

#7 నవీన్ పోలిశెట్టి

నవీన్ పోలిశెట్టి అంతకుముందు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 1-నేనొక్కడినే సినిమాల్లో నటించారు. అలాగే డి ఫర్ దోపిడీ సినిమాలో కూడా నలుగురు హీరోల్లో ఒకరిగా నటించారు.

Actor who started their careers with side roles

naveen polishetty in d for dopidi

#8 విజయ్ దేవరకొండ

విజయ్ దేవరకొండ అంతకుముందు రవిబాబు దర్శకత్వంలో వచ్చిన నువ్విలా సినిమాలో, అలాగే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నటించారు.

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లో ఈషా రెబ్బ అలాగే తేజస్విని కూడా కనిపిస్తారు.

Actor who started their careers with side roles

#9 రవితేజ

రవితేజ సక్సెస్ స్టోరీ గురించి మనందరికీ తెలుసు. కెరియర్ ప్రారంభంలో రవితేజ సీతారామరాజు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి తో పాటు ఇంకా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్స్ లో నటించారు.

Actor who started their careers with side roles

ravi teja in sitaramaraju

#10 విజయ్ సేతుపతి

మన భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న నటుల్లో బెస్ట్ యాక్టర్స్ లో ఒకరు విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి సీరియల్ లో, అలాగే షార్ట్ ఫిలిమ్స్ లో నటించారు. అంతే కాకుండా నా పేరు శివ తో పాటు, ఇంకా కొన్ని సినిమాల్లో సైడ్ రోల్ లో కూడా నటించారు.

Actor who started their careers with side roles

#11 శివ కార్తికేయన్

రెమో, సీమరాజా వంటి సినిమాలతో తెలుగు వారికి కూడా చేరువైన శివ కార్తికేయన్ అంతకుముందు ధనుష్ హీరోగా నటించిన త్రీ సినిమాలో ధనుష్ ఫ్రెండ్ గా నటించారు. శివ కార్తికేయన్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టక ముందు యాంకరింగ్ కూడా చేశారు.

Actor who started their careers with side roles

#12 జె డి చక్రవర్తి

హీరోగా పరిచయం అవ్వకముందు జె.డి.చక్రవర్తి శివ సినిమాలో కనిపిస్తారు.

Actor who started their careers with side roles

End of Article

You may also like