Ads
నట సింహం నందమూరి బాలకృష్ణ ఇవాళ తన 64వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ రాబోయే సినిమాలకు సంబంధించిన పోస్టర్, వీడియోలు విడుదల చేసి, ఆ సినిమా బృందం వారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరొక సినిమా వస్తుంది అని బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ప్రకటించారు. అయితే, బాలకృష్ణ, బాబీ దర్శకత్వంలో చేస్తున్న సినిమా బృందం కూడా ఒక వీడియో విడుదల చేశారు. ఈ సినిమాలో బాలకృష్ణ ఒక డిఫరెంట్ పాత్ర పోషిస్తున్నారు అని ఇది చూస్తే తెలుస్తోంది.
Video Advertisement
అయితే, ఈ వీడియోలో బాలకృష్ణ గురించి చెప్తూ ఒక వ్యక్తి కనిపిస్తారు. బాలకృష్ణ తో పాటు ఈ వ్యక్తికి కూడా ఈ వీడియోలో సమానంగా స్క్రీన్ టైం ఉంది. బాలకృష్ణకి ఇచ్చే ఎలివేషన్స్ సీన్ లో ఈ నటుడు కూడా హైలైట్ అయ్యారు. ఈ యాక్టర్ పేరు మకరంద్ దేశ్‌పాండే. మకరంద్ దేశ్‌పాండే ఎన్నో బాలీవుడ్ సినిమాలతో పాటు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించారు. 1988 లో వచ్చిన ఖయామత్ సే ఖయామత్ తక్ సినిమాతో తన కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత సర్కస్ అనే సీరియల్ తో తన సీరియల్ కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత సినిమాలు కూడా చేస్తూ వచ్చారు.
కొన్ని వెబ్ సిరీస్ కూడా చేశారు. కొన్ని సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. హిందీతో పాటు, మరాఠీ, తమిళ్, మలయాళం, కన్నడ, తెలుగు భాషల్లో కూడా సినిమాలు చేశారు. మంకీ మ్యాన్ అనే ఇంగ్లీష్ సినిమాలో కూడా నటించారు. జైలర్ సినిమాలో సికిందర్ సింగ్ పాత్రలో నటించారు. పొన్నియన్ సెల్వన్ 2 లో కూడా ఒక పాత్ర పోషించారు. తెలుగులో మకరంద్ దేశ్‌పాండే నటించిన మొదటి సినిమా జల్సా. ఆ తర్వాత లైగర్, రూల్స్ రంజన్, స్పై, ఆర్ఆర్ఆర్ సినిమాల్లో కూడా నటించారు. తన సినిమాల్లో నటనకి మకరంద్ దేశ్‌పాండే ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారు. ఇప్పుడు బాలకృష్ణ సినిమాతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకి వస్తున్నారు.
watch video :
End of Article