Ads
ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి 2898 ఏడీ నుండి బుజ్జి ఇంట్రడక్షన్ వీడియో విడుదల చేశారు. బుజ్జి ఈ సినిమాలో ప్రభాస్ పోషిస్తున్న భైరవ పాత్రకి ఫ్రెండ్ అని తెలుస్తోంది. బుజ్జి అనేది ఒక చిన్న రోబోట్ లాగా కనిపిస్తోంది. ఈ పాత్రకి హీరోయిన్ కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పారు. నిన్న ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అని ఒక ఈవెంట్ పెట్టి అందులో బుజ్జి తో తయారు చేసిన కార్ ని స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. ఈ కార్ ని ప్రభాస్ ఈవెంట్ లో డ్రైవ్ చేస్తూ తీసుకొచ్చారు. అంతే కాకుండా, ఇంట్రడ్యూసింగ్ బుజ్జి అని ఒక చిన్న వీడియో కూడా విడుదల చేశారు. ఇందులో అన్ని భాషలు కలిపి ఒకే వీడియో విడుదల చేశారు.
Video Advertisement
అన్ని భాషల్లో కూడా కీర్తి సురేష్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అయితే ఈ వీడియోలో ప్రభాస్ తో పాటు మరొక నటుడు కూడా కనిపించారు. వీడియో స్టార్టింగ్ లోనే ఇతను కనిపిస్తారు. ఇతను గతంలో కొన్ని సినిమాల్లో కూడా నటించారు. ఈ నటుడి పేరు హర్షిత్ రెడ్డి. హర్షిత్ రెడ్డి షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లో నటించారు. ప్రియదర్శి హీరోగా నటించిన లూజర్ వెబ్ సిరీస్ లో హర్షిత్ రెడ్డి నటించారు. ఆ తర్వాత వైజయంతి వారు నిర్మించిన మెయిల్ వెబ్ సిరీస్ లో కూడా నటించారు. ఇవి మాత్రమే కాకుండా తరగతి గది దాటి, అర్థమయ్యిందా అరుణ్ కుమార్ సిరీస్ లో కూడా హర్షిత్ రెడ్డి నటించారు.
ఇవన్నీ కూడా హర్షిత్ రెడ్డికి చాలా మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పుడు కల్కి సినిమాలో హర్షిత్ కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నటీనటులు కూడా ఉన్నారు. ప్రభాస్ బుజ్జి ఇంట్రడక్షన్ ఈవెంట్ లో అందరి గురించి మాట్లాడుతూ అందరికి థాంక్స్ చెప్పారు. ముఖ్యంగా కమల్ హాసన్ ఈ సినిమాలో నటించినందుకు ఆయనకి చాలా సార్లు థాంక్స్ చెప్పారు. చిన్నప్పటి నుంచి కూడా తాను కమల్ హాసన్ అభిమానిని అని అన్నారు. కమల్ హాసన్ సాగర సంగమం సినిమాలో వేసుకున్నట్టు తనకి కూడా డ్రెస్ కుట్టించమని ఇంట్లో వాళ్ళని చాలా సార్లు అడిగేవారు అని ప్రభాస్ చెప్పారు. సినిమా బృందం ప్రమోషన్స్ చాలా డిఫరెంట్ గా డిజైన్ చేశారు.
watch video :
End of Article