“జూనియర్ ఎన్టీఆర్” తో పాటు… “రామోజీ రావు” గారు పరిచయం చేసిన నటులు వీరే..!

“జూనియర్ ఎన్టీఆర్” తో పాటు… “రామోజీ రావు” గారు పరిచయం చేసిన నటులు వీరే..!

by Mohana Priya

Ads

ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారు ఇవాళ తుది శ్వాస విడిచారు. రెండు రోజులుగా అస్వస్థత కారణంగా వెంటిలేటర్ మీద ఉన్నారు. చిన్న వ్యాపారంతో తన జీవితాన్ని మొదలుపెట్టి, ఇప్పుడు పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించారు. రామోజీ గ్రూప్ పేరుతో ఈనాడు న్యూస్ పేపర్, ఈటీవీ, ఉషాకిరణ్ మూవీస్, ప్రియా ఫుడ్స్, మార్గదర్శి చిట్ ఫండ్స్, రామోజీ ఫిలిం సిటీతో పాటు, కళాంజలి, బ్రిసా వంటి బ్రాండ్స్ కూడా రామోజీరావు గారు ఆవిష్కరించారు.

Video Advertisement

ఈటీవీ 8 భాషల్లో ప్రసారం అవుతుంది. రామోజీ ఫిలిం సిటీ అయితే సినిమా ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించింది. ఎన్నో సేవలు అందిస్తోంది కూడా. ఒకరకంగా చెప్పాలి అంటే, రామోజీ ఫిలిం సిటీ లేకపోతే బాహుబలి సినిమా తీయడానికి చాలా కష్టం అయ్యేది అని సినిమా బృందం ఎన్నోసార్లు చెప్పారు. అది నిజం అనిపిస్తుంది. అయితే, ఉషాకిరణ్ మూవీస్ ద్వారా రామోజీ రావు గారు ఎంతో మంది నటులని పరిచయం చేశారు. వారిలో ఇప్పుడు స్టార్ నటులుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం.

actors introduced by usha kiran movies

#1 ఉదయ్ కిరణ్

చిత్రం సినిమా ద్వారా ఉదయ్ కిరణ్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.

#2 జూనియర్ ఎన్టీఆర్

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన నిన్ను చూడాలని సినిమాని ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ వాళ్ళు నిర్మించారు. ఇది జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన మొదటి సినిమా.

#3 తరుణ్

హీరో తరుణ్ నటించిన నువ్వేకావాలి సినిమాని కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు నిర్మించారు.

#4 శ్రియ

హీరోయిన్ శ్రియ మొదటి సినిమా ఇష్టం. ఈ సినిమాని కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్లే నిర్మించారు.

#5 ప్రకాష్ కోవెలమూడి

ప్రముఖ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి కొడుకు, ప్రకాష్ కోవెలమూడి నటించిన మొదటి సినిమా నీతో సినిమాని కూడా ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు.

#6 రితీష్ దేశ్‌ముఖ్

ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు బాలీవుడ్ లో కూడా సినిమాలు చేశారు. రితీష్ దేశ్‌ముఖ్ హీరోగా నటించిన మొదటి సినిమా అయిన తుజే మేరీ కసం సినిమాని ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు ప్రొడ్యూస్ చేశారు. ఇది నువ్వే కావాలి సినిమా రీమేక్.

#7 కళ్యాణ్ రామ్

నందమూరి కళ్యాణ్ రామ్ మొదటి సినిమా తొలిచూపులోనే సినిమాకి ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మాతలుగా వ్యవహరించారు.

#8 తనీష్

చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన తనీష్, హీరోగా నటించిన మొదటి సినిమా నచ్చావులే. ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన ఈ సినిమాతోనే తనీష్ హీరోగా పరిచయం అయ్యారు.

#9 రిచా పల్లోడ్

ఉషా కిరణ్ మూవీస్ వారు నిర్మించిన నువ్వే కావాలి సినిమాతోనే రిచా తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

#10 మాధవి లత

నచ్చావులే సినిమాతోనే మాధవి లత హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టారు.

కేవలం నటులని మాత్రమే కాదు. ఎంతో మంది సాంకేతిక నిపుణులని కూడా ఉషాకిరణ్ మూవీస్ వారు పరిచయం చేశారు.


End of Article

You may also like