Ads
ఒక సినిమా 50 రోజులు ఆడింది అంటే హిట్ అంటారు. వంద రోజులు ఆడింది అంటే సూపర్ హిట్ అంటారు. అదే ఒక సినిమా ఏడాది ఆడితే? అసలు ఏదైనా ఒక సినిమా ఏడాది పాటు ఆడుతుందా అనే అనుమానం కూడా వస్తుంది.
Video Advertisement
కానీ అలా ఏడాది పాటు ఆడిన సినిమా ఒకటి ఉంది. అది కూడా మన తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన సినిమా. ఆ సినిమా మరేదో కాదు రజినీకాంత్ నటించిన చంద్రముఖి సినిమా. ఈ సినిమా తమిళ్ లో సంవత్సరం ఆడింది. ఇందులో జ్యోతిక మరొక ముఖ్య పాత్రలో నటించారు. అసలు జ్యోతిక నటన చూసిన తర్వాత ఆమె చాలా సంవత్సరాల పాటు చంద్రముఖి గానే ప్రేక్షకులకి గుర్తున్నారు.
అందులోనూ ముఖ్యంగా ఆ పాట అయితే చాలా మందిని భయపెట్టేలా చేసింది. ఇప్పటికి కూడా ఈ సినిమా పేరు వింటే భయపడే వాళ్ళు ఉంటారు. చంద్రముఖి సినిమా మలయాళంలో రూపొందిన మణిచిత్రతాళు అనే సినిమాకి రీమేక్. తమిళ్ లో రజనీకాంత్ పోషించిన పాత్రని మలయాళంలో మోహన్ లాల్ పోషించారు. జ్యోతిక పోషించిన పాత్రని శోభన పోషించారు. ఈ సినిమాకి శోభన జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా అందుకున్నారు. అయితే చంద్రముఖి పాత్రలో చాలా మంది హీరోయిన్లు నటించారు. వారు ఎవరో వారు నటించిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం.
#1 శోభన
ఒరిజినల్ సినిమా అయిన మణిచిత్రతాళు సినిమాలో శోభన నాగవల్లి పాత్రలో నటించారు. మలయాళంలో రూపొందిన ఈ సినిమాలో నాగవల్లి పాత్ర తమిళ్ మాట్లాడుతుంది. ఈ సినిమాకి శోభన ఎన్నో అవార్డులు అభినందనలు అందుకున్నారు.
#2 సౌందర్య
కన్నడలో రూపొందిన ఆప్తమిత్ర సినిమాలో సౌందర్య గంగ పాత్రలో నటించారు. కన్నడలో కూడా ఈ పాత్ర పేరు నాగవల్లి అని పెట్టారు. ఇందులో కూడా నాగవల్లి పాత్ర తెలుగు మాట్లాడుతుంది.
#3 జ్యోతిక
తమిళ్ లో చంద్రముఖి పేరు పొందిన ఈ సినిమాలో గంగ పాత్రలో జ్యోతిక నటించారు. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి అదే పేరుతో విడుదల చేశారు. తమిళ్ లో చంద్రముఖి పాత్ర తెలుగు మాట్లాడుతారు. తెలుగులో చంద్రముఖి తమిళ్ లో మాట్లాడుతారు.
#4 విద్యా బాలన్
హిందీలో భూల్ భులయ్యా పేరుతో రూపొందిన ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. అక్షయ్ కుమార్ ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమాలో విద్యా బాలన్ చంద్రముఖి పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పేరుని మంజులిక అని మార్చారు. ఇందులో మంజులిక పాత్ర బెంగాలీ మాట్లాడుతుంది. ఈ పాత్రతో విద్యా బాలన్ కి చాలా మంచి గుర్తింపు వచ్చింది.
#5 అను చౌదరి
బెంగాలీలో ఇదే సినిమాని రాజ్ మొహుల్ పేరుతో రూపొందించారు. ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో అను చౌదరి నటించారు.
#6 విమల రామన్
ఆప్తమిత్ర కి సీక్వెల్ గా రూపొందిన ఆప్త రక్షకలో నాగవల్లి పాత్రలో విమల రామన్ నటించారు.
#7 అనుష్క
చంద్రముఖికి సీక్వెల్ గా తెలుగులో రూపొందిన నాగవల్లి సినిమాలో ఇదే పాత్రలో అనుష్క నటించారు. అయితే ఈ సినిమాలో చంద్రముఖి పేరు చంద్రముఖి కాదు అని, ఆమె అసలు పేరు నాగవల్లి అని చెప్తారు.
#8 టబు
హిందీలో వచ్చిన భూల్ భులయ్యా సినిమాకి సీక్వెల్ గా భూల్ భులయ్యా – 2 రూపొందించారు. ఇందులో కార్తీక్ ఆర్యన్, కియారా అద్వానీ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా స్టోరీ చాలా వరకు మార్చారు. అయితే మొదటి భాగంలో మంజులిక అనే పాత్ర మీద కథ నడుస్తుంది. ఇందులో కూడా మంజులిక అనే ఒక పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో టబు నటించారు.
అయితే చంద్రముఖి సినిమాకి, ఈ సినిమాకి అసలు సంబంధం ఉండదు. కానీ మొదటి పార్ట్ లో యూజ్ చేసిన పాటని మాత్రం ఇందులో కూడా వాడారు. అంతే కాకుండా ఈ సినిమాలో టబుని కూడా సంగీతం, నృత్యం పట్ల ఆసక్తి ఉన్న వ్యక్తిగానే చూపించారు. ఇందులో టబు అంజులిక అనే మరో పాత్రలో కూడా నటించారు.
#9 కంగనా రనౌత్
ఇప్పుడు చంద్రముఖి రూపొందిన చాలా సంవత్సరాల తరువాత దానికి అసలైన సీక్వెల్ గా రూపొందుతున్న చంద్రముఖి 2 సినిమాలో చంద్రముఖి అనే పాత్రలో కంగనా రనౌత్ నటిస్తున్నారు. ఈ సినిమా మొదటి భాగానికి కొనసాగింపుగానే ఉంటుంది అని చెప్పారు. అంతే కాకుండా మొదటి భాగంలో నటించిన వడివేలు కూడా ఇందులో ఉన్నారు. రజనీకాంత్ పాత్రలో లారెన్స్ నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదల అయ్యింది.
ఈ హీరోయిన్లు అందరూ కూడా చంద్రముఖి కథతో రూపొందిన రీమేక్ సినిమాల్లో ఆ హీరోయిన్ పాత్రలో నటించారు. ఒక సినిమాలో చంద్రముఖి అయితే, మరొక సినిమాలో నాగవల్లి. ఇంకొక సినిమాలో ఇంకొక పేరు. కానీ పాత్ర మాత్రం అన్ని సినిమాల్లో ఒకటే. కథ కూడా దాదాపు ఒకటేలాగా ఉంటుంది. మరి ఇప్పుడు చంద్రముఖి 2 లో ఎలా చూపిస్తారో తెలియాలి అంటే సినిమా విడుదల అయ్యేంతవరకు ఆగాల్సిందే.
ALSO READ : BIGG BOSS TELUGU-7 : అసలు ఎవరు ఈ పల్లవి ప్రశాంత్..? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే..?
End of Article