పల్లవి ప్రశాంత్…నిన్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదలైన తర్వాత నుంచి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన పేరు. ఎన్నాళ్లో వేచిన ఉదయం ఈనాడే ఎదురైంది అనే సాంగ్తో బిగ్ బాస్ లో బియ్యం బస్తా ఎత్తుకొని అడుగుపెట్టిన ఈ ప్రశాంత్ కుమార్ .. జీవిత లక్ష్యమే బిగ్ బాస్ లోకి ఎంటర్ అవ్వడం.

Video Advertisement

అవును ఇది నిజం.. నన్ను షోలోకి తీసుకోండి నాగార్జున గారు అంటూ ఇప్పటికే అతను వందల కొద్ది వీడియోలు చేసి ఉంటాడు.

bigg boss telugu 7 pallavi prashanth

ఎలాగైతేనేం మొత్తానికి ఈ రైతుబిడ్డ ఆశించినట్లుగానే బిగ్ బాస్ స్టేజిపై ఎంట్రీ ఇచ్చాడు. నాగార్జున హోస్ట్ చేస్తున్న బుల్లితెర పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ లో 13వ కంటెస్టెంట్ గా పల్లవి ప్రశాంత్ రావడం జరిగింది. స్టార్ మా మరియు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారమయ్యే బిగ్ బాస్ షో కి అభిమానులు ఏ రేంజ్ లో ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే బిగ్ బాస్ సీజన్ 6 లో జరిగిన తప్పిదాలను ఈసారి జరగనివ్వకుండా సీజన్ సెవెన్ ను ఎంతో గ్రాండ్ గా మరిన్ని సర్ప్రైజ్లతో ప్లాన్ చేయడం జరిగింది.

bigg boss telugu 7 pallavi prashanth

అందుకే ఇందులో తీసుకునే కంటెస్టెంట్స్ విషయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో హౌస్ మేట్స్ అయిన 14 మంది కంటెస్టెంట్స్ లో కొంతమంది సోషల్ మీడియాలో బాగా పాపులారిటీ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వ్యక్తి ఇంస్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ మరియు రైతు బిడ్డ అయిన పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డ అని చెబుతూ పలు రకాల వ్యవసాయం రీల్స్ తో పాటు ఎమోషనల్ రీల్స్ కూడా చేసి బాగానే పాపులర్ అయ్యాడు ఈ పల్లవి ప్రశాంత్.

bigg boss telugu 7 pallavi prashanth

సోషల్ మీడియాలో బాగా ఫేమ్ రావడంతో ప్రస్తుతం ప్రమోషన్స్, ఈవెంట్స్ అని బాగానే సంపాదిస్తున్నాడు. ఇతని మీద పాజిటివ్ ఎంతగా ఉందో సోషల్ మీడియాలో నెగిటివ్ కూడా అంతగానే ఉంది మరి. జనరల్గా బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యే కాంటెస్ట్ ని నిర్వాహకులు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇతను మాత్రం పదే పదే సోషల్ మీడియాలో నేను బిగ్ బాస్ కి వెళ్ళాలి… నాగార్జున గారు ప్లీజ్ నన్ను తీసుకోండి…అందరూ నాకు సపోర్ట్ చేయండి అని తెగ ప్రమోషన్స్ చేసుకున్నాడు.

bigg boss telugu 7 pallavi prashanth

దీని కారణంగా అతనిపై కొంతమంది. మరోపక్క రైతుల పేరు చెప్పుకొని సంపాదించుకుంటూ రైతులను వాడుకుంటున్నాడు అని కూడా కొందరు అభిప్రాయపడతారు. అసలు విషయం ఎవరికీ తెలియదు, కానీ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఇతను రీల్స్ లో చూపించినట్టే సరదాగా ,ప్లైన్ గాఉంటాడా లేక ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడా చూడాలి మరి..

ALSO READ : OG మ్యూజిక్ ఒరిజినల్ అనుకున్నాం..! ఇది కూడా కాపీయేనా..?