Ads
మనం అందరం దేవుడ్ని ఎప్పుడు నేరుగా చూడలేదు. కానీ మనకి దేవుడు ఎలా ఉంటారో కొన్ని సినిమాల్లో కళ్ళకి కట్టినట్టు చూపించారు. అలా మన తెలుగు తెరపై దేవుళ్లుగా కనిపించి, మన సినీ ప్రేక్షకుల చేత ఆరాధించబడుతున్న కొంత మంది హీరోలున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం..
Video Advertisement
ఇప్పుడు ఏ ఏ హీరోలు దేవుడిగా కనిపించి..మెప్పించారో చూద్దాం..
#1 ఎన్టీఆర్
రాముడు, కృష్ణుడు అనగానే ఎవరికైన గుర్తు వచ్చే పేరు ఎన్టీఆర్. అప్పట్లో కొందరు ప్రజలు ఆయన ఫోటోనే దేవుడిగదిలో పెట్టుకొని పూజించేవారు. ఈయన సంపూర్ణ రామాయణం, లవకుశ, రామదాసు, శ్రీరామాంజనేయ యుద్ధం, శ్రీరామ పట్టాభిషేకం చిత్రాల్లో రాముడిగా.. మాయాబజార్ వంటి చిత్రాల్లో కృష్ణుడిగా కనిపించారు. అలాగే ‘దక్షయజ్ఞం’ మూవీ లో శివుడిగా కనిపించారు.
#2 బాలకృష్ణ
శ్రీరామ రాజ్యం మూవీ లో బాలకృష్ణ రాముడిగా కనిపించారు. అలాగే ‘పాండురంగడు’ మూవీ లో కృష్ణుడిగా కనిపించారు.
#3 రాజేంద్ర ప్రసాద్
కన్నయ్య కిట్టయ్య, బ్రహ్మ లోకం తో యమ లోకం చిత్రాల్లో కృష్ణుడిగా, బ్రహ్మ దేవుడిగా కనిపించారు రాజేంద్ర ప్రసాద్.
#4 శోభన్ బాబు
సంపూర్ణ రామాయణం’ చిత్రంలో శోభన్ బాబు రాముడి పాత్ర చేసి ఆకట్టుకున్నారు. అలాగే ‘పరమానందయ్య శిష్యుల కథ’ సినిమాలో శివుడి పాత్రలో నటించి మెప్పించారు. ‘బుద్ధిమంతుడు’ చిత్రం లో కృష్ణుడిగా కనిపించారు.
#5 నాగార్జున
కింగ్ నాగార్జున కృష్ణార్జున మూవీ లో కృష్ణుడిగా కనిపించారు. అలాగే షిర్డీ సాయి మూవీ లో సాయిబాబా గా కనిపించారు.
#6 పవన్ కళ్యాణ్
‘గోపాల గోపాల’ మూవీ లో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించారు. ఇక తాజాగా రానున్న ‘బ్రో’ మూవీ లో కూడా దేవుడిగా కనిపించనున్నారు పవన్.
#7 చిరంజీవి
మెగాస్టార్ చిరంజీవి శ్రీ మంజునాథ మూవీ లో శివుడిగా కనిపించారు.
#8 ప్రకాష్ రాజ్
‘డమరుకం’ మూవీ లో ప్రకాష్ రాజ్ శివుడిగా కనిపించారు.
#9 సుమన్
అన్నమయ్య, శ్రీ సత్యనారాయణ మహత్యం, రామదాసు సినిమాల్లో సుమన్ విష్ణుమూర్తిగా కనిపించారు.
#10 శ్రీకాంత్
దేవుళ్ళు చిత్రం లో శ్రీకాంత్ రాముడిగా ఒక పాటలో కనిపించారు.
#11 సౌరభ్ జైన్
ఓం నమో వేంకటేశాయ చిత్రం లో సౌరభ్ జైన్ వెంకటేశ్వర స్వామి గా కనిపించారు.
#12 ప్రభాస్
ఆదిపురుష్ మూవీ లో ప్రభాస్ శ్రీ రాముడిగా కనిపించారు.
End of Article