మనందరినీ తమ నటనతో లేక తమ ఆటతీరుతో ఇన్ స్పైర్ చేసే సెలబ్రిటీలు ఎప్పుడూ మీడియా మరియు జనాల నోళ్లల్లో నానుతూ ఉంటారు.ఇక తాజాగా భారత ఆల్ రౌండర్ హార్దిక పాండ్యకు మరియు ఆయన గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాన్కోవిచ్ కు ఒక పండంటి మగ బిడ్డ జన్మించాడు.

Video Advertisement

ఇలా పెళ్లికి ముందు లివింగ్ రిలేషన్ లో ఉంటూ తల్లిదండ్రులు అయినా సెలబ్రెటీలు ఎవరో ఇప్పుడు చూద్దాం.

1.నేహా ధుపియా అండ్ అంగత్ బేడీ

నేహా ధుపియా ఈమె బాలీవుడ్ లోనే కాదు తెలుగు సినిమాలలో కూడా నటించింది. మొదటిది రాజశేఖర్ తో నటించిన ‘ విలన్ ‘. ఇక రెండవది బాలకృష్ణ, దాసరి నారాయణరావు కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పరమవీర చక్ర’. ఈమె తన బాయ్ ఫ్రెండ్ అంగత్ బేడీతో లివింగ్ లో ఉన్నప్పుడు ప్రెగ్నంట్ అయ్యింది. ఆ తర్వాత వీరు పెళ్లి చేసుకున్నారు.

2.కొంకణ సేన్ శర్మ అండ్ రణవీర్

మరో బాలీవుడ్ హీరోయిన్ కొంకణ సేన్ లివింగ్ లో ఉంటున్న సమయంలో ప్రెగ్నెంట్ అయ్యారు. ఆతరువాతే పెళ్లి పీఠలు ఎక్కారు.

3.సారిక అండ్ కమల్ హాసన్

విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న కమల్ హాసన్ చాలా కాలం పాటు సారికతో లివింగ్ లో ఉన్నారు.పెళ్లి కాక ముందే వీరికి శ్రుతి హాసన్ జన్మించింది.ఆతరువాతే వీరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు

4. శ్రీదేవి అండ్ బోనీకపూర్

జగదేక సుందరి శ్రీదేవి, బోనీకపూర్ తో కలిసి లివింగ్ లో ఉన్నారు. వారిద్దరూ వివాహం చేసుకునే టైంకి శ్రీదేవి 7 నెలల ప్రెగ్నెంట్ గా ఉన్నారు.

5. సెలీనా జైట్లీ అండ్ పీటర్ హాగ్

మరో బాలీవుడ్ హాట్ బ్యూటీ సెలీనా జైట్లీ తన బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ లో ఉంటుంది. అప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చారు.

6. అమ్రితా అరోరా అండ్ షకీల లదక్

ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా అదేనండి గబ్బర్ సింగ్ లో కెవ్వు కేక పాటకు డాన్స్ చేసిన బ్యూటీ చెల్లెలు ఈ అమ్రితా అరోరా లివింగ్ లో ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఇక తను ప్రెగ్నెంట్ అని తెలియడంతో హడావిడిగా తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంది.

7. మహిమ చౌదరి అండ్ బాబీ ముఖర్జీ

బాలీవుడ్ నటి మహిమ చౌదరి ఆర్కిటెక్ట్ అయిన బాబీ ముఖర్జీని పెళ్లి చేసుకుంది. సరిగ్గా పెళ్లి అయిన 5 నెలలకు వీరికి ఒక బిడ్డ జన్మించాడు.

8.ఎమీ జాక్సన్ అండ్ జార్జ్

తెలుగు,తమిళ భాషలలో చాలా సినిమాలు చేసిన ఈమె గత కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన బాయ్ ఫ్రెండ్ తో లివింగ్ లో ఉంటున్న టైంలోనే ఎమీ జాక్సన్ ప్రెగ్నెంట్ అయ్యారు.

9.క‌ల్కి కొక్లేయిన్ అండ్ హర్ష బెర్గ్

ఈ బాలీవుడ్ నటి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ తో డైవర్స్ తీసుకున్నాక తన బాయ్ ఫ్రెండ్ హర్ష బౌ తో లివింగ్ లో ఉంటున్నారు. ఇక లివింగ్ లో ఉండగానే ఈమె కూడా తల్లి అయ్యింది.

10.ఇలియానా

ఇలియానా కూడా తాను తల్లి కాబోతున్నట్టు సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు.

11.అలియా భట్ రణబీర్ కపూర్

వీరు కూడా పెళ్లి అయిన కొంతకాలానికి వారు తల్లిదండ్రులు కాబోతున్నట్టు ప్రకటించారు. కానీ వార్తల ప్రకారం ఆలియా భట్ పెళ్లి సమయానికి గర్భవతిగా ఉన్నట్టు చెప్పారు.

ranbeer kapoor about his daughter..

12.హార్దిక పాండ్య అండ్ నటాషా స్టాన్కోవిచ్

తన సెర్బియన్ గర్ల్ ఫ్రెండ్ నటాషా స్టాన్కోవిచ్ తో చాలా రోజుల నుండి లివింగ్ లో ఉంటున్న హార్దిక్ పెళ్లి కాకుండానే తండ్రి అయ్యాడు.