“అల్లు అర్జున్” నుండి “మహేష్ బాబు” వరకు… స్టేజ్ మీద “ఎమోషనల్” అయిన 12 నటులు..!

“అల్లు అర్జున్” నుండి “మహేష్ బాబు” వరకు… స్టేజ్ మీద “ఎమోషనల్” అయిన 12 నటులు..!

by Mohana Priya

సినిమా వాళ్ళని మనం వేరే ప్రపంచం నుండి వచ్చిన వారిలాగా చూస్తూ ఉంటాం. వారు కూడా మనుషులే అన్న విషయాన్ని అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం. వాళ్ళు ఏది చేసినా కూడా కరెక్ట్ గా చేయాలి అనుకుంటాం. వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది.

Video Advertisement

కానీ సినిమా వాళ్లు కూడా మనలాంటి మనుషులే. వాళ్లకి ఎమోషన్స్ ఉంటాయి. ప్రతిరోజు సంతోషంగా ఉండలేరు. ఒకసారి కోపంగా ఉంటారు. ఒక్కొక్కసారి బాధగా ఉంటారు. అలా బాధగా ఉన్నా సరే వాళ్ళ వృత్తి మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని వేరుగా చూస్తూ, వారి వ్యక్తిగతంగా పరిస్థితి ఎలా ఉన్నా కూడా వారి పని వారు చేసుకుంటారు.

what did our star heros did before becoming stars..!!

అలా మన సినీ నటులు చాలా ఈవెంట్స్ కి హాజరు అవుతుంటారు. ప్రతి ఈవెంట్ లో ఆనందంగా నవ్వుతూ మాట్లాడడం వారికి ఒక్కొక్కసారి కష్టం అవుతుంది. వారు ఆ స్థానంలో ఉండడానికి అంతగా ఆదరించిన ప్రేక్షకులని వారి కుటుంబం లాగా వాళ్ళు భావిస్తారు కాబట్టి వారి బాధని కూడా ప్రేక్షకులతో పంచుకోవాలి అని అనుకుంటారు. అలా స్టేజ్ మీద కొంత మంది నటులు ఎమోషనల్ అయ్యారు. వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం.

reasons for mahesh babu become super star..!!

#1 జూనియర్ ఎన్టీఆర్

అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ గారు మరణించారు. ఆ తర్వాత అరవింద సమేత రిలీజ్ కి ముందు చేసిన ఈవెంట్ లో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

#2 షారుఖ్ ఖాన్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ తాను ఇండస్ట్రీలోకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

#3 రష్మిక మందన్న

హీరోయిన్ రష్మిక మందన్న డియర్ కామ్రేడ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, తను సినిమా చేసే సమయంలో ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొన్నారో చెప్పారు. నిజంగా ఒక హీరోయిన్ ఇలా మాట్లాడడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది.

#4 అల్లు అర్జున్

అల వైకుంఠపురంలో ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, తన తండ్రి తన కోసం ఎంతో చేశారు అని, అల్లు అరవింద్ గారికి థాంక్స్ చెబుతూ ఎమోషనల్ అయ్యారు.

#5 కార్తికేయ గుమ్మకొండ

కార్తికేయ ఒక ఈవెంట్ లో చిరంజీవికి ట్రిబ్యూట్ ఇస్తూ డాన్స్ పెర్ఫార్మెన్స్ చేశారు. అందులో కార్తికేయ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. అది చూస్తున్న చిరంజీవి కూడా ఎమోషనల్ అయ్యారు.

#6 అనుష్క శెట్టి

హీరోయిన్ అనుష్క అసలు బయటికి రావడమే చాలా తక్కువ. అలాంటిది అనుష్క నిశ్శబ్దం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా క్యాష్ ప్రోగ్రామ్ కి వెళ్లారు. అక్కడ అనుష్క జర్నీని ఒక వీడియో చేసి చూపించారు. అది చూసిన అనుష్క ఎమోషనల్ అయ్యారు.

#7 సాయి పల్లవి

సాయి పల్లవి కూడా శ్యామ్ సింఘ రాయ్ ఈవెంట్ లో మాట్లాడుతూ, తనని అంతగా ఆదరించినందుకు ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు. ఆ ఈవెంట్ లో సాయి పల్లవి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.

#8 సమంత

యశోద సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. ఆ తర్వాత శాకుంతలం సినిమా ట్రైలర్ ఈవెంట్ లో కూడా సమంత ఎమోషనల్ అయ్యారు.

#9 శివ రాజ్‌కుమార్

కన్నడ హీరో శివ రాజ్‌కుమార్ హీరోగా నటించిన వేద సినిమా తెలుగులో కూడా విడుదల అయ్యింది. ఈ ప్రమోషనల్ ఈవెంట్ లో భాగంగా తెలుగులో చేసిన ఒక ఈవెంట్ లో తన తమ్ముడు పునీత్ రాజ్‌కుమార్ వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు.

#10 మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు తన సోదరుడు రమేష్ బాబు గారు మరణించారు. అందుకే సర్కారు వారి పాట ఈవెంట్ లో మహేష్ బాబు ఎమోషనల్ అయ్యారు. అంతే కాకుండా ఇటీవల గుంటూరు కారం ఈవెంట్ లో కూడా ఎమోషనల్ అయ్యారు. గత సంవత్సరం మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించిన కొంతకాలం తర్వాత, తండ్రి కృష్ణ గారు మరణించారు. దాంతో మహేష్ బాబు ప్రేక్షకులను చూసి ఎమోషనల్ అయ్యి తనకి తల్లి తండ్రులు ప్రేక్షకులే అని చెప్పారు.

#11 ఐశ్వర్యా రాయ్

ఐశ్వర్యా రాయ్ సరబ్‌జిత్ అనే సినిమా ఇంటర్వ్యూలో భాగంగా ఆయన గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

#12 విజయ్ దేవరకొండ

దొరసాని ఈవెంట్ లో విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.

అలా ఈ నటులు అభిమానుల మధ్యలో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.


You may also like

Leave a Comment