లావు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీలు వీరే..!

లావు తగ్గడం కోసం సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీలు వీరే..!

by Anudeep

Ads

సినిమా రంగుల ప్రపంచం లో నిలదొక్కుకోవడానికి చాలా మంది కలలు కంటారు. అయితే.. ఈ రంగం లో నిలదొక్కుకోవడానికి ప్రధానం గా కావాల్సింది అందం..ఆ తరువాత ప్రతిభ. అందుకే నటులు, ముఖ్యం గా హీరోయిన్లు అందం గా కనిపించడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

Video Advertisement

feature

సినిమా రంగం లో మిగిలిన పనుల్లో ఉండేవాళ్ళు ఎలా ఉన్నా, నటులు గా ప్రూవ్ చేసుకోవాలనుకునే వారు మాత్రం కచ్చితం గా అందం పై శ్రద్ద చూపిస్తారు. కొన్ని సార్లు ఈ అతి శ్రద్ధ అనేది ఇక్కట్లు తెచ్చిపెడుతుంది. కొందరు హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ లు, పెదాలను, ముక్కుని సరిచేయించుకోవడం వంటివి చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. అయితే, కొందరు బరువుని తగ్గడం కోసం కూడా లైపో సెక్షన్ వంటివి చేయించుకుంటున్నారు. ఈ సర్జరీ కొన్ని సార్లు సక్సెస్ అయినప్పటికీ, చాలా సార్లు వికటించడం వలన ప్రాణాలు కోల్పోతుంటారు. అలా, లైపోసక్షన్ సర్జరీ చేయించుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్న సెలెబ్రిటీల లిస్ట్ ను ఓ సారి చూద్దాం.

1. ఆర్తి అగర్వాల్:

arthi agarwal
ఆర్తి అగర్వాల్ ఎంత అందం గా ఉంటారో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు. అందం తో పాటు అభినయం, నటన ఆమె సొంతం. అందుకే చిన్న వయసు లోనే ఆమె దాదాపు అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. చిన్న వయసుకే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అయితే, ఆమె ప్రేమ జీవితం కారణం గా కెరీర్ నిలిచిపోయింది. అయితే, డిప్రెషన్ కి లోనైన ఆర్తి చాలా బరువు పెరిగిపోయింది. కొన్ని ఏళ్ల తరువాత తిరిగి ఆ స్టార్ డమ్ ను సొంతం చేసుకోవాలని భావించింది. అందుకోసం లైపో సక్షన్ సర్జరీ చేయించుకోవాలనుకుంది. ఆమె కు తెలిసిన వ్యక్తిగత డాక్టర్ కూడా వద్దని వారించినప్పటికీ ఆమె వినలేదు. ఆర్తి తాను పుట్టిన పెరిగిన అమెరికా లోనే లైపో సక్షన్ చేయించుకుంది. దురదృష్టవశాత్తు అది వికటించడం తో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

2. మిస్తీ ముఖర్జీ:

misthi mukharji
బాలీవుడ్ నటి మిస్తీ ముఖర్జీ ఇందుకు మరో ఉదాహరణ. బెంగాలీ సినిమాలలో బాగా పాపులర్ అయినా మిస్తీ ముఖర్జీ పలు హిందీ సినిమాలలో కూడా నటించి మెప్పు పొందారు. అయితే, ఏమి తిన్నా లావు అయిపోయే శరీర తత్త్వం కారణం గా ఆమె బరువు పెరిగిపోయారు. దానివలన ఆమె కు అవకాశాలు సన్నగిల్లాయి. అయితే ఎలా అయినా సన్నబడాలన్న కోరికతో, తిరిగి అవకాశాలను సంపాదించుకోవాలన్న జిజ్ఞాసతో ఆమె కీతో డైట్ ను ఫాలో అయ్యారు. డాక్టర్ వారించినప్పటికీ.. ఆమె అతిగా ఆ డైట్ ను ఫాలో అయ్యారు. దీనితో ఆమె చాలా సన్నగా అయిపోయారు. ఆమె ఆరోగ్యం చెడిపోవడం మాత్రమే కాకుండా కిడ్నీలు కూడా పాడైపోయాయి. ఎంత ఖర్చు చేసినప్పటికీ ఆమె తిరిగి తన ఆరోగ్యాన్ని పొందలేకపోయింది. కేవలం ఇరవై ఏడేళ్ల వయసులోనే ఆమె తన ప్రాణాలను పోగొట్టుకుంది.

3. రాకేష్ దివానా:

rakesh diwanaసీరియల్స్ నటుడి గా రాకేష్ దివానా మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమాల్లో కూడా కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రాకేష్ కి మంచి పేరు ఉంది. ఈయన బరువు దగ్గడం కోసం బేరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నారు. ఈ సర్జరీ జీర్ణాశయానికి చేస్తారు. ఇది చాలా ప్రమాదకరం. ఈ సర్జరీ సక్సెస్ అయింది. కానీ, ఆ తరువాత బీపీ లెవెల్స్ లో చాలా మార్పులు వచ్చాయి. వీటిని కంట్రోల్ చేయడం వైద్యుల వల్ల కాలేదు. దీనితో ఈయన కూడా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. బరువు తగ్గడం కోసం సర్జరీ లు చేయించుకోవడం అంత శ్రేయస్కరం. ఎక్కడో కొందరికి ఇవి ఉపయోగపడుతుంటాయి. డైటింగ్ , వ్యాయాయం ద్వారా బరువు తగ్గడమే ఉత్తమం.


End of Article

You may also like