ఒకప్పుడు ఈ 7 మంది సూపర్ స్టార్స్…కానీ ఇప్పుడు దయనీయ స్థితిలో..కొందరైతే బిచ్చమెత్తుకుంటూ.!

ఒకప్పుడు ఈ 7 మంది సూపర్ స్టార్స్…కానీ ఇప్పుడు దయనీయ స్థితిలో..కొందరైతే బిచ్చమెత్తుకుంటూ.!

by Mohana Priya

Ads

పరిస్థితులు ఎప్పుడూ ఒకటే లాగా ఉండవు. ఇవాళ కనీస అవసరాలకి కూడా ఇబ్బంది పడేవారికి రేపు అన్ని సౌకర్యాలు ఉండొచ్చు. అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్లు కూడా తర్వాత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఒకప్పుడు సినిమా రంగంలో రాణించిన కొంత మంది సెలబ్రిటీలు తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయారు. వాళ్ళలో కొంత మంది ఎవరో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

#1 పర్వీన్ బాబి

అప్పట్లో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న పర్వీన్ బాబి జనవరి 22, 2005 లో ముంబైలోని తన ఫ్లాట్ లో శవంగా కనిపించారు. చనిపోయిన రెండు రోజుల వరకు పర్వీన్ బాబీ మృతదేహాన్ని క్లైమ్ చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. అప్పుడు ప్రముఖ దర్శకుడు మహేష్ భట్, పర్వీన్ బాబి అంత్యక్రియల బాధ్యతను తీసుకున్నారు.

#2 భగవాన్ దాదా

నటులు, దర్శకులు అయిన భగవాన్ దాదా, సినిమాలు ఫ్లాప్ అవ్వడం వల్ల ఇల్లు కార్లు అమ్మేసి, ముంబై లోని చాల్ లో నివసించారు.

#3 గీతాంజలి నాగ్ పాల్

గీతాంజలి ఒక మోడల్. తర్వాత తను డ్రగ్స్ కి బానిస అయ్యారు. సంపాదించినదంతా పోవడంతో సౌత్ ఢిల్లీ లో యాచిస్తూ కనిపించారు. అలాగే పనిమనిషిగా కూడా పని చేశారు గీతాంజలి.

#4 ఓ.పీ.నయ్యర్

ప్రముఖ గాయకులు ఓ.పీ.నయ్యర్ మద్యానికి బానిస అయ్యారు. కుటుంబం కూడా ఆయనకు దూరం అయింది. తన దగ్గరికి ఇంటర్వ్యూ కోసం అడగడానికి వచ్చిన వాళ్లకి ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం మద్యం ఇంకా డబ్బులు తీసుకునే వారు. ఓ.పీ.నయ్యర్ చనిపోయే ముందు చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.

#5 మిథాలీ శర్మ

భోజపురి నటి మిథాలీ శర్మ, తర్వాత సినిమా అవకాశాలు తగ్గడంతో ముంబైలో యాచిస్తూ కనిపించారు. అంతే కాకుండా దొంగతనం చేయడానికి కూడా ప్రయత్నించారు.

#6 సులక్షణ పండిట్

సింగర్ అయిన సులక్షణ పండిట్ సంజీవ్ కుమార్ ని ప్రేమించారు. సంజీవ్ కుమార్, సులక్షణ ప్రేమని రిజెక్ట్ చేసిన తర్వాత సులక్షణ పెళ్లి చేసుకోలేదు. తర్వాత అవకాశాలు తక్కువగా ఉండటంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సులక్షణ గుడిమెట్ల పై అడుక్కుంటూ కనిపించారు అనే వార్తలు కూడా వచ్చాయి.

తర్వాత సులక్షణ సోదరి విజయ పండిట్, తన భర్త ఇంకా ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ ఆదేశ్ శ్రీవాస్తవ సులక్షణ బాగోగులు చూసుకున్నారు. సులక్షణ కోసం ఒక భక్తి పాటల ఆల్బమ్ కూడా కంపోజ్ చేద్దామనుకున్నారు. కానీ అంతలోపే ఆదేశ్ శ్రీవాస్తవ మరణించారు.

#7 సావి సిద్ధూ

హిందీ సీరియల్స్, సినిమాల్లో నటించిన సావి సిద్ధూ మార్చి 2019 లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా ముంబైలో సెక్యూరిటీ గార్డ్ గా పని చేస్తున్నట్లు గుర్తించారు.

 


End of Article

You may also like