Ads
సినిమా ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటే పాత్రల కోసం తమ లుక్ ను హీరోలు, హీరోయిన్లు మార్చుకోవాల్సి ఉంటుందనే సంగతి తెలిసిందే. కొన్నిసార్లు పాత్రల కోసం బరువు తగ్గి పూర్తి ఫిట్ గా మారాల్సి ఉంటుంది.. అలాగే కథ కోసం.. పాత్ర ప్రాధాన్యత మేరకు బరువు పెరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
Video Advertisement
అలా ఇప్పుడు పాత్రల కోసం బరువు పెరిగిన నటులు ఎవరో ఇప్పుడు చూద్దాం..
#1 అనుష్క – సైజ్ జీరో
ప్రకాష్ కోవెలమూడి తెరకెక్కించిన ‘సైజ్ జీరో’ చిత్రం లో అనుష్క తన పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది. ఆ వెయిట్ తగ్గించుకోవడానికి అనుష్క ఇప్పటికి కష్టపడుతోంది.
#2 విద్యా బాలన్ – డర్టీ పిక్చర్
సిల్క్ స్మిత బయో పిక్ లో నటించిన విద్యా బాలన్ ఆ పాత్ర కోసం 12 కేజీ ల బరువు పెరిగింది.
#3 కంగనా రనౌత్ – తలైవి
తమిళనాడు మాజీ ముఖ్య మంత్రి, నటి అయిన జయలలిత బయోపిక్ లో నటించిన కంగనా రనౌత్ ఆ పాత్ర కోసం ఏకంగా 20 కిలోల బరువు పెరిగింది.
#4 భూమి పెడ్నేకర్ – దం లగా కె హైశ
తన తొలి చిత్రం “దం లగా కె హైశ” కోసం బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ 30 కిలోల వెయిట్ పెరిగింది. ఆ తర్వాత చిత్రాల కోసం మళ్ళీ బరువు తగ్గి అందర్నీ ఆశ్చర్యపరిచింది.
#5 ఆమిర్ ఖాన్ – దంగల్
దంగల్ చిత్రం లో మహావీర్ సింగ్ ఫోగట్ పాత్ర కోసం ఆమిర్ 27 కిలోల బరువు పెరిగారు.
#6 కృతి సనన్ – మిమి
మిమి చిత్రం లో సరోగేట్ మదర్ పాత్ర కోసం కృతి సనన్ 15 కిలోలు పెరిగింది.
#7 సల్మాన్ ఖాన్ – సుల్తాన్
సుల్తాన్ చిత్రం కోసం సల్మాన్ ఖాన్ ఏకంగా 18 కిలోల బరువు పెరిగారు.
#8 అశోక్ సెల్వన్ – నిన్నిలా నిన్నిలా
నిన్నిలా నిన్నిలా మూవీ లో అధిక బరువున్న చెఫ్ పాత్ర కోసం అశోక్ సెల్వన్ 20 కేజీ ల బరువు పెరిగారు.
#9 సుధీర్ బాబు – మామ మశ్చీంద్ర
ఎప్పుడు ఫిట్ గా సిక్స్ ప్యాక్ తో కనిపించే సుధీర్ బాబు తాజా చిత్రం మామ మశ్చీంద్ర మూవీ లో లావుగా ఉన్న వ్యక్తి పాత్రలో నటిస్తున్నాడు.
#10 ప్రభాస్ – బాహుబలి
బాహుబలి చిత్రం కోసం ప్రభాస్ భారీగా కండలు పెంచి 20 కేజీ ల బరువు పెరిగాడు.
#11 రాజ్ కుమార్ రావ్ – బోస్
సుభాష్ చంద్ర బోస్ బయో పిక్ బోస్ చిత్రం కోసం రాజ్ కుమార్ రావ్ 11 కేజీ లు పెరిగాడు.
#12 రానా – బాహుబలి
బాహుబలి చిత్రం లో ప్రతినాయకుడిగా నటించిన రానా ఆ పాత్ర కోసం 18 కేజీ లు పెరిగాడు.
End of Article