“రజినీకాంత్” లాగానే… సినిమాల కోసం “ప్రభుత్వ” ఉద్యోగాలని వదులుకున్న 9 నటులు..!

“రజినీకాంత్” లాగానే… సినిమాల కోసం “ప్రభుత్వ” ఉద్యోగాలని వదులుకున్న 9 నటులు..!

by kavitha

Ads

ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతీ ఒక్కరికి ఆసక్తి ఉంటుంది.ఎందుకంటే జాబ్ సెక్యూరిటీ, సౌకర్యం ఉంటుంది. కుటుంబ సభ్యులకు కూడా బెనిఫిట్స్ ఉంటాయి. భరోసాను కల్పిస్తుంది.ప్రభుత్వ ఉద్యోగాలు రావడమే ఆరాడు ఈ రోజుల్లో. కానీ  ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నప్పటికీ నటన పై ఉన్న ఇష్టంతో తమ కెరీర్‌ను పణంగా పెట్టి, సినీ పరిశ్రమకు వచ్చి, ఎన్నో ఇబ్బందులు దాటుకుని పెద్ద స్టార్లుగా నిలిచిన బాలీవుడ్ ప్రముఖుల గురించి తెలుసుకుందాం. మరి వారు ఎవరో చూద్దాం..

Video Advertisement

1.రజనీకాంత్

బాలీవుడ్‌లో కూడా పనిచేసిన సౌత్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకప్పుడు బెంగళూరు ట్రాన్స్‌పోర్ట్ సర్వీస్‌లో బస్ కండక్టర్‌గా పనిచేశారు. అతను నటుడిగా మారడం కోసం తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. నేడు అతను భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న నటులలో ఒకరు. అతనికి దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు మరియు ప్రజలు అతన్ని తలైవా అని ప్రేమగా పిలుస్తారు.rajinikantn-telugu adda 2.దిలీప్ కుమార్

హిందీ సినీ పరిశ్రమ చూసిన అత్యంత ప్రతిభావంతుల్లో దిలీప్ కుమార్ ఒకరు.దివంగత నటుడు దిలీప్ కుమార్ ఔంద్ పూణేలో మిలటరీ క్యాంటీన్‌ను నడిపేవారు. బాలీవుడ్ నటి దేవికా రాణి అతన్ని గుర్తించి బాలీవుడ్ సినిమా ఆఫర్ ఇచ్చింది.ఇక అప్పటి నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు.
3.దేవ్ ఆనంద్

బాలీవుడ్‌లోకి రాకముందు దేవ్ ఆనంద్ సెన్సార్ బోర్డ్ క్లర్క్‌గా పనిచేశాడు. ఎన్నో హిట్ చిత్రాలను అందించిన ఆయన చిత్ర పరిశ్రమకు అందించిన సేవలు ఎనలేనివి.
4.రాజ్ కుమార్

40వ దశకం చివరిలో రాజ్ కుమార్ ముంబైకి వెళ్ళి అక్కడ ముంబై పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్‌గా పనిచేశాడు. బాలీవుడ్‌లో కెరీర్‌ను కొనసాగించేందుకు ఉద్యోగాన్ని వదిలేశాడు.
5.జానీ వాకర్

బాలీవుడ్ లో పాత తరము గొప్ప హాస్య నటుడు జానీ వాకర్.సినిమాల్లోకి రాకముందు జానీ వాకర్ ముంబైలో బస్ కండక్టర్ గా పని చేసేవాడు.
6.బాల్‌రాజ్ సాహ్ని

బాల్‌రాజ్ సాహ్ని ప్రముఖ నటుడు. నటుడిగా మారక ముందు బెంగాల్‌లోని శాంతినికేతన్‌లోని విశ్వభారతి విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పని చేశారు. అతని భార్య కూడా అదే సంస్థలో బోధించింది.7.అమోల్ పాలేకర్

అమోల్ పాలేకర్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేసేవాడు.అయితే ఆ ఉద్యోగాన్ని వదిలి బాలీవుడ్‌ లో కెరీర్‌లో కొనసాగించాడు.
8.అమ్రిష్ పూరి

సినీ పరిశ్రమలో విశిష్ట నటుడిగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న అమ్రిష్ పూరి, ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. కానీ నటించాలనే కలను నెరవేర్చుకోవడం కోసం హీరోగా హిందీ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. అయితే అమ్రిష్ పూరి ఎక్కువగా విలన్ రోల్స్ లోనే నటించాడు. మిస్టర్ ఇండియాలోని ఆయన చేసిన మొగాంబ పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
 9.శివాజీ సతమ్

ACP ప్రద్యుమన్ పాత్రలో పాపులర్ అయిన శివాజీ సతమ్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో  క్యాషియర్ గా పనిచేసేవారు. కానీ కానీ అతను నటన పై ఉన్న ఆసక్తితో థియేటర్‌లో చేరి నటుడిగా మారాడు.


End of Article

You may also like