Ads
హిందువులకు మహాశివరాత్రి పండుగ చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. శివరాత్రి రోజున శంకరుడిని నియమ నిబంధనల ప్రకారం పూజించిన భక్తులు దుఃఖాల నుండి విముక్తి పొందుతారని మరియు జీవితంలో ఆనందం మరియు శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. పురాణాల ప్రకారం, ఈ పవిత్రమైనే రోజునే శివపార్వతుల కళ్యాణం జరిగిందని చెబుతారు. అందుకే ఈ పర్వదినాన ఉపవాసం ఉండి, జాగరణ చేస్తూ శివయ్యను కొలిస్తే తమకు పరమేశ్వరుని అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున బిల్వ పత్రాలతో శివయ్యను పూజించి, శివ మంత్రాలను జపించిన వారికి మోక్షం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు.
Video Advertisement
ఓ చెంబుడు జలంతో అభిషేకం చేసి.. మారేడు పత్రాలతో పూజచేస్తే పరవశించి పోతాడాయన.ఆ మహాదేవుని లీలలను కూడా ఎంతో మంది దర్శకులు వెండితెరపై ఆవిష్కరించారు.ఇక ఆయన ముఖ్యపాత్రలతో పాటు శివ దేవునిపై తెలుగులో చాలా చిత్రాలే వచ్చాయి.
అలా తెలుగు తెరపై మహాదేవుని పాత్రలో నటించి మెప్పించిన హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ అంటే మనకి ముందుగా రాముడు,కృష్ణుడు వేషాలే గుర్తుకు వస్తాయి. కానీ ఈయన ‘దక్షయజ్ఞం’,‘ ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ సినిమాల్లో శివుడి వేషంలో మెప్పించారు.
#2 అక్కినేని నాగేశ్వర రావు
అక్కినేని నాగేశ్వరరావు శివుడిగా పౌరాణిక సినిమా చేయకపోయినా.. ‘మూగ మనసులు’ చిత్రం లో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ పాటలోని రెండు మూడు సన్నివేశాల్లో శివుడిగా కనిపించి మెప్పించారు.
#3 శోభన్ బాబు
నట భూషణ శోభన్ బాబు కూడా ‘పరమానందయ్య శిష్యుల కథ’ చిత్రం లో శివుడిగా నటించారు.
#4 కృష్ణంరాజు
‘వినాయక విజయం’ చిత్రం లో రెబెల్ స్టార్ కృష్ణం రాజు శివుని పాత్రలో నటించారు.
#5 బాలయ్య
సీనియర్ నటుడు బాలయ్య చాలా చిత్రాల్లో శివుని పాత్రలో నటించారు. ఈయన ‘జగన్మాత’తో పాటు ‘భక్త కన్నప్ప’ తదితర చిత్రాల్లో మహా దేవుని పాత్రల్లో నటించారు.
#6 రామకృష్ణ
సీనియర్ హీరో రామ కృష్ణ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘మాయా మశ్చీంద్ర’ సినిమాలో పరమ శివుడి పాత్రలో మెప్పించారు.
#7 రంగనాథ్
కృష్ణ హీరోగా నటించిన ‘ఏకలవ్య’ చిత్రంలో రంగనాథ్ మహా దేవుని వేషంలో నటించారు.
#8 చిరంజీవి
రాఘవేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీ మంజునాథ’లో చిరంజీవి.. పరమ శివుడి వేషంలో మెప్పించారు. అంతకు ముందు చిరంజీవి ‘ఆపద్భాందవుడు’, పార్వతి పరమేశ్వరులు’ చిత్రాల్లో కాసేపు శివుడి వేషం లో కనిపించారు.
#9 బాలకృష్ణ
జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘సీతా రామకళ్యాణం’ సినిమాలో ‘ఎంత నేర్చినా ఎంత చూసినా..’ అనే పాటలో శివుడిగా కాసేపు కనిపించారు.
#10 నాగార్జున
నాగార్జున అక్కినేని కూడా భారవి దర్శకత్వంలో తెరకెక్కిన ‘జగద్గురు ఆది శంకర’ చిత్రంలో నాగార్జున శివుడి మరో రూపమైన చండాలుడు పాత్రలో కాసేపు కనిపించారు.
#11 సుమన్
సుమన్ కూడా శ్రీ సత్యనారాయణ మహత్యం’ సినిమాలో సత్యనారాయణ స్వామితో పాటు శివుడిగా, బ్రహ్మాగా నటించారు.
#12 ప్రకాష్ రాజ్
‘ఢమరుకం’ సినిమాలో ప్రకాష్ రాజ్ శివుడి పాత్రలో ఒదిగిపోయారు. ఈ సినిమాలో నాగార్జున, అనుష్క శెట్టి హీరో, హీరోయిన్లుగా నటించారు.
#13 రాజనాల
టాలీవుడ్ లో ఒకనాటి విలన్ రాజనాల ‘ఉషా పరిణయం’ వంటి ఒకటి రెండు సినిమాల్లో పరమ శివుడిగా మెప్పించారు.
#14 రావు గోపాల రావు
తెలుగులో ఒకప్పుడు విలన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రావు గోపాల్ రావు ‘మావూళ్లో మహాశివుడు’ సినిమాలో మహాశివుడుగా మెప్పించారు.
#15 నాగ భూషణం
తెలుగులో వైవిధ్య నటుడిగా పేరు తెచ్చుకున్న నాగ భూషణం ‘భూకైలాస్’, ‘ఉమా సుందరి’, ‘నాగుల చవితి’ సినిమాల్లో శంకరుడిగా నటించారు.
End of Article