రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ సినిమాను మిస్ చేసుకున్న నటీనటులు వీరే..!

రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ ‘రంగస్థలం’ సినిమాను మిస్ చేసుకున్న నటీనటులు వీరే..!

by kavitha

Ads

దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ సినిమా ‘రంగస్థలం’. వై.రవి శంకర్, వై.నవీన్, సి.వి.మోహన్ లు కలిసి నిర్మించిన ఈ సినిమా మార్చి 30న 2018లో రిలీజ్ అయ్యింది. ఈ మార్చి 30కి ఈ సినిమా రిలీజ్ అయ్యి ఐదు సంవత్సరాలు అయ్యింది. 1985 లో ఉభయ గోదావరి జిల్లాల రాజకీయాలు, అక్కడ ఉండే వాతావరణం, నేపథ్యం, అణగదొక్కడం వంటి అంశాలతో ఈ సినిమాని దర్శకుడు సుకుమార్ తీర్చిదిద్దాడు.

Video Advertisement

ఈ సినిమాపై మొదట్లో అంచనాలు అంతగా లేవు. రామ్ చరణ్, సమంత జంటగా నటించిన ఈ మూవీ రిలీజ్ అయ్యాక తొలి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దాంతో భారీ వసూళ్ళు  సాధించింది ఈ సినిమా. వినికిడి సమస్యతో ఉన్న చిట్టిబాబు అనే పాత్రలో రామ్ చరణ్ నటన మూవీకే హైలెట్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో నటించిన నటినటులందరికి కూడా ప్రశంసలు వచ్చాయి. అలాంటి ఈ సినిమాని కొంత  మంది పాపులర్ నటీనటులు మిస్ చేసుకున్నారు. మరి ఆ యాక్టర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం..
stars-missed-rangasthalam-movie1. రాజశేఖర్ :
రంగస్థలం సినిమాలో జగపతి బాబు నటించిన ప్రెసిడెంట్ క్యారెక్టర్ కు ఎంతటి పేరు వచ్చిందో తెలిసిందే. అయితే ఈ పాత్రకు మొదట అనుకుంది జగపతి బాబును కాదు. సుకుమార్ ఈ పాత్ర కోసం హీరో రాజశేఖర్ కి కథ చెప్పారంట. అయితే ఆయన ఒప్పుకోలేదంట.hero-rajashekar2. అనుపమ పరమేశ్వరన్ :
ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట అనుకుంది సమంతని కాదంట. సుకుమార్ అనుపమ పరమేశ్వరన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆమె కొన్ని కారణాలతో ఈ సినిమా నుండి తప్పుకుంది. దాంతో సమంతను తీసుకున్నారు. anupama-parameshwaran3. రాశి :
ఈ చిత్రంలో మరో కీలకమైన పాత్ర  రంగమ్మత్త. ఈ క్యారెక్టర్ లో అనసూయ నటించింది. ముందుగా ఈ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ రాశిని అడిగారంట. అయితే ఆ రాశికి ఆ క్యారెక్టర్ వస్త్రాలంకరణ నచ్చకపోవడంతో చేయనని  చెప్పింది.heroine-raasi4.పృథ్వీ రాజ్ :
ఈ సినిమాలో కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ నటించారు. అయితే సినిమా నిడివి ఎక్కువ అవడడంతో కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ లో తొలగించారంట. వాటిలో పృథ్వీ నటించిన సీన్స్ కూడా ఉన్నాయి.
stars-missed-rangasthalam-movie1Also Read: లవకుశ సినిమాలో “అంజలీదేవి” నుండి ఆదిపురుష్ సినిమాలో “కృతి సనన్” వరకు… సినిమాల్లో “సీతా దేవి” పాత్రలో నటించిన 8 హీరోయిన్స్..!


End of Article

You may also like