Ads
2005లో విడుదలైన గజిని మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచింది. అప్పట్లో ఈ సినిమా ఓ ట్రెండ్ సెట్టర్‌గా మారింది. ఇప్పటికీ ఎవరైనా ఏదైనా కాస్త మర్చిపోతే.. ఏంటి గజినిలా తయారయ్యావంటూ ఇప్పటికీ ఈ సినిమా పేరును వాడేస్తుంటారు. మతి మరుపు అనే కాన్సెప్ట్‌తో కమర్షియల్ సినిమా తీసి బ్లాక్‌బాస్టర్ సాధించొచ్చు అని ఏ.ఆర్ మురుగుదాస్ నిరూపించాడు. పేరుకు రీమేక్ సినిమానే అయిన మన నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేసి మురుగుదాస్ ఒక మంచి చిత్రాన్ని ప్రేక్షకులకు అందించాడు.
Video Advertisement
ఈ చిత్రంలో సూర్య నటన వర్ణనాతీతం. సంజయ్ రామస్వామి పాత్రలో నటించాడు అనడం కంటే జీవించేశాడు అనడం సబబు. ఈ సినిమాతో సూర్యకు టాలీవుడ్‌లోనూ విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా టాలీవుడ్ సినిమాలకు సమానంగా ‘గజిని’ చిత్రం ఇక్కడ వసూళ్ళను సాధించింది. హాసిని, నయనతార తమ తమ పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక హారిస్ జయరాజ్ సంగీతం అయితే వేరే లెవల్. ఈ చిత్రాన్ని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశాడు. ఈ చిత్రం రూ.50 కోట్ల కలెక్షన్‌లను సాధించి ట్రిపుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఇంతటి బ్లాక్ బాస్టర్ సినిమాను 13మంది స్టార్ హీరోలు రిజెక్ట్ చేశారట.
ఏ.ఆర్ మురుగుదాస్ ముందుగా ఈ సినిమాను తెలుగు హీరోలతో తీయాలని మహేష్‌బాబుకు ఈ కథను చెప్పాడట. అలాగే అజిత్ కి కథ వినిపించగా ఓకే చెప్పి షూటింగ్ స్టార్ట్ చేశారట. కానీ అజిత్‌కు నిర్మాతకు మధ్య విభేదాలు వచ్చి సినిమాను మధ్యలోనే ఆపేశారు. అలా చివరికి ఈ చిత్రం సూర్య దగ్గరికి చేరింది. ఇక సూర్య సంతోషంతో ఇలాంటి కథ కోసమే చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నాను అని మురుగదాస్‌తో చెప్పాడట. ఇక సంవత్సరంలో సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకని 2005 సెప్టెంబర్ 29న సినిమా విడుదలై సంచలన విజయం సాధించింది. సూర్యకు స్టార్ హీరో స్టేటస్‌ను తీసుకొచ్చింది. అలాగే ఈ చిత్రాన్ని హిందీ లో అమిర్ ఖాన్ రీమేక్ చెయ్యగా సూపర్ హిట్ అయ్యింది.
అయితే ఈ సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం..
#1 అజిత్
#2 మాధవన్
#3 మహేష్ బాబు
#4 రజనీకాంత్
#5 విజయ్
#6 మోహన్ లాల్
#7 పవన్ కళ్యాణ్
#8 విక్రమ్
#9 వెంకటేష్
#10 సల్మాన్ ఖాన్
#11 శింబు
#12 అజయ్ దేవగన్
#13 సైఫ్ అలీ ఖాన్
End of Article