Ads
ఒక్కొక్కసారి మనం చదివిన చదువు ఒకటైతే మనం ఎంచుకునే వృత్తి వేరే ఉంటుంది. దానికి కారణం మనకి వేరే రంగం మీద ఉన్న ఆసక్తి. అలా సెలబ్రిటీల్లో కూడా చాలా మంది ఇంజనీరింగ్ చదివి వేరే ప్రొఫెషన్ ఎంచుకొని, అందులో కష్టపడి రాణిస్తున్నారు. వాళ్ళలో కొంతమంది ఎవరో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 అక్కినేని నాగార్జున
నాగార్జున కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, గిండి లో ఇంజనీరింగ్ చేశారు. తర్వాత ఈస్టర్న్ మిచిగాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేశారు.
#2 సోను సూద్
సోనూసూద్ యశ్వంత్ రావు చవాన్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేశారు.
#3 రీతు వర్మ
రీతు వర్మ మల్లారెడ్డి కాలేజ్ లో ఇంజనీరింగ్ చేశారు.
#4 విక్కీ కౌశల్
బాలీవుడ్ యంగ్ యాక్టర్స్ లో ఒక్కరైన విక్కీ కౌశల్, రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ చేశారు.
#5 శేఖర్ కమ్ముల
శేఖర్ కమ్ముల చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సిబిఐటి) లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు తరువాత యుఎస్ లో ఎం.ఎస్ చేశారు.
#6 కృతి సనన్
కృతి సనన్ జెపి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు.
#7 శివ కార్తికేయన్
రెమో, సీమ రాజా లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా మనందరికీ సుపరిచితులైన శివ కార్తికేయన్ జె జె కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో ఇంజనీరింగ్ చేశారు.
#8 పృథ్వీరాజ్ సుకుమారన్
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ యూనివర్సిటీ ఆఫ్ టాస్మానియా లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ చేశారు.
#9 శ్రీనివాస్ అవసరాల
శ్రీనివాస్ అవసరాల కేఎల్ యూనివర్సిటీ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ నార్త్ డకోటా లో మాస్టర్స్ చేశారు.
#10 రితేష్ దేశ్ ముఖ్
బాలీవుడ్ నటుడు రితేష్ దేశ్ ముఖ్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేశారు.
#11 తరుణ్ భాస్కర్
దర్శకుడు తరుణ్ భాస్కర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.
#12 కార్తీ
కార్తీ క్రెసెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. తర్వాత అబ్రాడ్ లో మాస్టర్స్ చేశారు.
#13 తాప్సీ
తాప్సీ గురు తేగ్ బహదూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో కంప్యూటర్ సైన్స్ లో ఇంజనీరింగ్ చేశారు.
#14 గౌతమ్ మీనన్
దర్శకుడు గౌతమ్ మీనన్ మూకాంబిగై కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లో మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు.
#15 నివిన్ పాలీ
మలయాళం సినిమాలు బెంగళూరు డేస్, ప్రేమమ్ ద్వారా ఇక్కడ కూడా పాపులర్ అయిన నివిన్ పాలీ, ఫెడరల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ చేశారు.
End of Article