Ads
ప్రతి సినిమాకి హీరో, హీరోయినే ప్రధానం. వారి చుట్టే కథంతా తిరుగుతూ ఉంటుంది. సడన్ గా హీరో కానీ హీరోయిన్ కానీ చనిపోతే ఒక్కసారిగా ప్రేక్షకుడి హృదయం బరువెక్కుతుంది.
Video Advertisement
అలా సినిమాల్లో హీరో కానీ హీరోయిన్ కానీ చనిపోయిన టాప్ తెలుగు మూవీస్ ఏంటో ఒకసారి చూద్దాం..
#1 ప్రభాస్:
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ “బాహుబలి”. ఇందులో హీరో ప్రభాస్ మరణిస్తాడు.
కృష్ణవంశీ దర్శకత్వంలో 2005 లో వచ్చిన “చక్రం” సినిమాలో కూడా ప్రభాస్ చనిపోతాడు.
#2. నాగార్జున:
ఆర్. ఆర్. షిండే డైరెక్షన్ లో 2000 ల సంవత్సరంలో వచ్చిన “నిన్నే ప్రేమిస్తా” చిత్రంలో నాగార్జున చనిపోతాడు.
#3. ఎన్టీఆర్:
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 2004 లో వచ్చిన “”ఆంధ్రావాలా” చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ మరణిస్తాడు.
అలాగే కే. ఎస్. రవీంద్ర డైరక్షన్ లో వచ్చిన “జై లవ కుశ”లో కూడా ఎన్టీఆర్ చనిపోయే పాత్రే చేశాడు.
#4 రవితేజ:
రాజమౌళి డైరక్షన్ లో 2006 లో వచ్చిన “విక్రమార్కుడు” సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఉన్న మాస్ మహారాజ్ రవితేజ మరణిస్తాడు.
#5 నాని
న్యాచురల్ స్టార్ నాని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సినిమాల్లో చనిపోయే పాత్రలే చేశాడు.
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “ఈగ”లో నాని మరణిస్తాడు.
అలాగే గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో వచ్చిన “జెర్సీ” లో కూడా నాని చనిపోతాడు.
తాతినేని సత్య దర్శకత్వంలో వచ్చిన “భీమిలి కబడ్డీ జట్టు” లో కూడా నాని మరణించే పాత్రే చేసాడు.
మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన జెంటిల్ మన్,
రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన శ్యామ్ సింఘ రాయ్ లో కూడా నాని చనిపోతాడు.
#6 రానా, కాజల్:
డైరెక్టర్ తేజ 2017లో తీసిన “నేనే రాజు నేనే మంత్రి” సినిమాలో హీరో రానా, హీరోయిన్ కాజల్ కూడా మరణిస్తారు.
#7 సాయి పల్లవి:
లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా రెండు సినిమాల్లో మరణించే పాత్రలే చేసింది.
నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో వచ్చిన “శ్యామ్ సింఘ రాయ్” లో సాయి పల్లవి మరణిస్తుంది.
అలాగే ఇటీవల విడుదలైన వేణు ఊడుగుల డైరెక్షన్ లో వచ్చిన “విరాట పర్వం” లో కూడా సాయి పల్లవి మరణించే పాత్రే చేసింది.
#8 సాయి ధరమ్ తేజ్:
గత సంవత్సరం దేవ కట్ట దర్శకత్వంలో వచ్చిన “రిపబ్లిక్” సినిమాలో సాయి ధరమ్ తేజ్, ఐశ్వర్య రాజేష్ హీరో హీరోయిన్లుగా నటించగా, జగపతిబాబు, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో హీరో సాయి ధరమ్ తేజ్ మరణిస్తాడు.
#9 ఆసిన్:
మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన “గజినీ” సినిమాలో సూర్య, ఆసిన్, నయనతార హీరో, హీరోయిన్లుగా నటించారు.
అయితే కల్పన పాత్రలో ఉన్న ఆసిన్ ఈ సినిమాలో చనిపోతుంది.
#10 సోనియా అగర్వాల్:
2004 లో సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో “7/జీ బృందావన కాలనీ” సినిమా వచ్చింది. ఇందులో రవి కృష్ణ, సోనియా అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించగా అనిత పాత్రలో ఉన్న సోనియా అగర్వాల్ చనిపోతుంది.
#11 అన్షు అంబానీ:
2002లో కే. విజయ భాస్కర్ దర్శకత్వంలో “మన్మథుడు” సినిమా విడులైంది. ఇందులో అక్కినేని నాగార్జున, సోనాలి బింద్రే, అన్షు అంబానీ హీరో హీరోయిన్లు కాగా మహేశ్వరి పాత్రలో ఉన్న అన్షు మరణిస్తుంది.
ALSO READ : “శాకుంతలం”లో ఈ సీన్ గమనించారా..? చూసుకోవాలి కదా ఎడిటర్ గారూ..?
End of Article