మెగాస్టార్ చిరంజీవి గారు దాదాపు కొన్ని దశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో నెంబర్ 1 స్థానం లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. మెగాస్టార్ సినిమా అంటే అప్పట్లో ఏ రేంజ్ లో సందడి ఉండేదో అందరికి తెలిసిందే. కానీ మెగా స్టార్ అనే టాగ్ చిరు కి సింపుల్ గా రాలేదు. దాని వెనక ఎంతో కష్టం ఉంది. సైడ్ ఆర్టిస్ట్ గా, విలన్ గా కూడా నటించి స్వయంకృషితో పైకొచ్చి ఇప్పుడు మెగాస్టార్ గా నిలిచి ఎంతో మంది యువ కథానాయకులకు ఆదర్శనంగా నిలిచారు చిరు. అయితే చిరంజీవి గారు అల్లు రామలింగయ్య గారి కూతురు సురేఖ ను వివాహం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే.  ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే. చిరంజీవి గారి పెళ్లి టైం కి ఆయన ఇంకా స్టార్ అవ్వలేదు. అల్లు రామలింగయ్య గారు అప్పటికే ఇండస్ట్రీ లో సీనియర్ నటుడు. అంత పెద్ద నటుడు తన కూతురుకి చిరుని ఇచ్చి ఎలా పెళ్లి చేసారు అని అప్పట్లో అందరు అనుకునే వారు. ఈ ప్రశ్నలకు సీనియర్ హీరోయిన్ జవాబిచ్చింది. చిరంజీవి సురేఖను వివాహం చేసుకోవడానికి సీనియర్ హీరోయిన్ రాజ శ్రీ నే కారణమట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలు బయటపెట్టారు.

అల్లు రామలింగయ్య కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పుకొచ్చారు. తన చిన్నప్పటి నుంచే ఇరు ఫ్యామిలీల మధ్య మంచి అనుబంధం కొనసాగిందని తెలిపారు. ఒకసారి ‘అత్తను దిద్దిన కోడలు’ చిత్ర షూటింగ్ సందర్బంగా అల్లు రామలింగయ్య తన దగ్గరికి వచ్చాడని ఆ సమయంలో రామలింగయ్య కూతురు పెళ్లి విషయమై మాట్లాడారని చెప్పుకొచ్చారు

ఇండస్ట్రీలోకి ఓ కొత్త కుర్రాడు వచ్చాడు..బాగా డ్యాన్స్ చేస్తుంటాడు.. మా అమ్మాయి సురేఖను అతనికి ఇద్దామని అనుకుంటున్నానని తన అభిప్రాయం అడిగాడని తెలిపారు. అయితే నటి రాజశ్రీ కూడా అల్లూరి రామలింగయ్య తీసుకున్నటువంటి నిర్ణయానికి సమ్మతించారట. అలా రాజశ్రీ కూడా చిరంజీవి పెళ్లి కావడానికి పరోక్షంగా మాట సాయం చేసినట్లు చెప్పుకొచ్చారు.

అంతేకాదు మూడు పేర్లతో తనని పిలుస్తారని ఆమె చెప్పారు. తమిళ సినీ పరిశ్రమలో గ్రేసీ అని, తెలుగు సినీ పరిశ్రమలో రాజశ్రీ అని, తమ కుటుంబ సభ్యులు కుమారి అని పిలుస్తారట.అలాగే తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, పలు భాషల్లో కలిపి దాదాపుగా 300కు పైగా చిత్రాల్లో ఆమె నటించారంట.