నటి భాగ్య శ్రీ అందరికీ సుపరిచితమే. ఆమె కోసం మనం కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. పైగా చాలా మంది ఫ్యాన్స్ కూడా భాగ్య శ్రీ కి ఉన్నారు. ఆమె వయసు అయిదు పదులు దాటుతున్నా సరే చాలా అందంగా కనబడుతున్నారు.

Video Advertisement

బుల్లితెర నుండి వెండి తెర వరకు ఆమె చాలా మంది ప్రేక్షకులని ఫిదా చేశారు. చక్కటి పాపులారిటీని కూడా సొంతం చేసుకున్నారు.

ఈరోజు భాగ్యశ్రీ తన బ్యూటీ సీక్రెట్ ని చెప్పారు. మరి 53 ఏళ్ల వయసు లోనూ అంత అందంగా ఆమె ఎలా ఉన్నారు..? కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూసేద్దాం. భాగ్యశ్రీ మరాఠా రాజ కుటుంబానికి చెందినవారు. ఈమె ”మైనే ప్యార్ కియా” సినిమాతో చక్కటి పాపులారిటీని సొంతం చేసుకున్నారు. అయితే తన తల్లి చెప్పిన చిట్కాలు వలన ఇంత అందంగా ఉంటున్నాను అని అంటున్నారు. ఆమె చర్మ సౌందర్యానికి కారణం ఓట్స్ అని ఆమె బయట పెట్టారు. ఓట్స్ లో కొంచెం పాలు, కొద్దిగా తేనె వేసి బ్లెండ్ చేసేసి దానిని ముఖానికి పట్టిస్తే సరిపోతుందట.

ఈ పేస్ట్ ఆరిన తర్వాత ముఖం కడుక్కుంటే చక్కటిని నిగారింపుని సొంతం చేసుకోవచ్చు. అయితే ఈ పేస్ట్ ఎండి పోయిన తర్వాత వేళ్ళ తో స్క్రబ్ చేసుకోవాలి. ఇలా స్క్రబ్ చేసుకుంటే స్కిన్ బాగుంటుంది. ఆ తర్వాత ఫేస్ వాష్ చేసేయండి. అయితే ఓట్స్ ఆరోగ్యం కోసమే కాదు అందానికి కూడా చక్కటి ప్రయోజనాన్ని ఇస్తాయి.

ఓట్స్ లో మృత కణాలని తొలగించే లక్షణం ఉంటుంది కాబట్టి ముఖానికి ఇది చక్కటి ఫలితాన్ని తీసుకు వస్తుంది. ఇక పాలు అయితే చక్కటి తేమని ఇచ్చి చర్మాన్ని సాఫ్ట్ గా మారుస్తాయి. యాంటీసెప్టిక్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు తేనెలో ఉంటాయి కాబట్టి ఇది కూడా స్కిన్ కి ప్రయోజనాన్ని కల్పిస్తుంది ఈ విధంగా కనక మీరు ఫాలో అయితే కచ్చితంగా భాగ్యశ్రీ లాగే అందంగా మెరిసిపోవచ్చు.