రామ్ పోతినేని “డబుల్ ఇస్మార్ట్” టీజర్ లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

రామ్ పోతినేని “డబుల్ ఇస్మార్ట్” టీజర్ లో కనిపించిన ఈ నటి ఎవరో తెలుసా..? ఈమె బ్యాక్‌గ్రౌండ్‌ ఏంటంటే..?

by Mohana Priya

Ads

రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా డబుల్ ఇస్మార్ట్ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఈ సినిమాకి పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. సంజయ్ దత్ ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. 2019 లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా సినిమా రూపొందుతోంది. ఈ సినిమాని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. తెలుగులో మాత్రమే కాకుండా, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో కూడా ఈ సినిమా విడుదల చేస్తున్నారు. మొదటి భాగంలో రామ్ పోతినేని ఎలాంటి గెటప్ లో ఉంటారో ఇందులో కూడా అదే గెటప్ లో ఉన్నారు.

Video Advertisement

actress in double ismart teaser

ఇస్మార్ట్ శంకర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో, అన్ని కామెంట్స్ కూడా ఎదుర్కొంది. అందులో కొన్ని సీన్స్ అభ్యంతరకరంగా ఉన్నాయి అంటూ చాలా విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా టీజర్ చూస్తూ ఉంటే ఇది కూడా ఇస్మార్ట్ శంకర్ టెంప్లేట్ లోనే రూపొందినట్టు తెలుస్తోంది. ఈ టీజర్ లో షయాజీ షిండే, జబర్దస్త్ శ్రీను, సంజయ్ దత్, హీరోయిన్ కావ్య థాపర్ తో పాటు మరొక నటి కూడా కనిపించారు. టీజర్ స్టార్టింగ్ లో రామ్ పోతినేనితో పాటు ఈ నటి ఉంటారు. టీజర్ మొత్తానికే హైలైట్ అయ్యారు. అప్పటి నుండి ఆ నటి ఎవరు అని తెగ వెతికేస్తున్నారు. ఆమె పేరు బాని. బాని బాలీవుడ్ నటి. ఈమె వీజే బానిగా కూడా ఫేమస్ అయ్యారు. బాని అసలు పేరు గుర్బానీ జడ్జ్. 2007 లో వచ్చిన ఆప్ కా సురూర్ సినిమాతో కెరీర్ మొదలు పెట్టారు.

ఆ తర్వాత సౌండ్ ట్రాక్, జొరావర్ సినిమాల్లో నటించారు. 2016 లో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన తిక్క సినిమాలో ఒక పాత్రలో నటించారు. 2022 లో వచ్చిన అజిత్ కుమార్ హీరోగా నటించిన వలిమై సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటించారు. ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ సినిమాలో నటించారు. బాని 2006 లో ఎం టీవీ వాళ్లు నిర్వహించిన రోడీస్ అనే ప్రముఖ ప్రోగ్రాం యొక్క నాలుగవ సీజన్ లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం బాని కి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. ఆ తర్వాత సినిమాల్లో నటించారు. అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ అనే వెబ్ సిరీస్ బానికి ఇంకా గుర్తింపు తీసుకొచ్చింది. సంజయ్ దత్ తో పాటు బాని కనిపిస్తున్నారు. కాబట్టి ఈ సినిమాలో విలన్ వాళ్లతో బాని ఉన్నట్టు తెలుస్తోంది.

watch video :


End of Article

You may also like