బిగ్ బాస్ సీజన్ 7 కోసం బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా ప్రసారం అయ్యి, ఆడియెన్స్ ను అలరించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఏడవ సీజన్ మొదలవనుంది.
Video Advertisement
బిగ్ బాస్ సీజన్ 7 కి కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఒక ప్రోమో రిలీజ్ చేశారు. అయితే ఈ ప్రోమోలో కనిపించిన అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీసున్నారు. మరి ఆమె ఎవరో ఇప్పుడు చూద్దాం..
మొదటి సీజన్ కి జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా, రెండవ సీజన్ కి హీరో నాని హోస్ట్ గా చేశారు. మూడవ సీజన్ నుండి కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక రాబోయేగా సీజన్ కి కూడా ఆయనే హోస్ట్. బిగ్ బాస్ సీజన్ 7 ప్రమోషన్ లో భాగంగా రిలీజ్ చేసిన ప్రోమోలు ఈ సీజన్ పై అంచనాలను పెంచుతున్నాయి. ఏడవ సీజన్ సరికొత్తగా ఉండబోతుందని నాగార్జున ప్రోమోలలో హింట్ ఇస్తూ, ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచారు. ఇక ఈసారి ప్రోమోలను కూడా భిన్నంగా ప్లాన్ చేశారు.
తాజాగా రిలీజ్ అయిన ఈ ప్రోమో నటించిన అమ్మాయి ఎవరా అని నెటిజెన్లు ఆరా తీస్తూ, ఆన్ లైన్ లో వెతుకుతున్నారు. అయితే తాజాగా వచ్చిన ప్రోమో కనిపించిన అమ్మాయి పేరు అలేఖ్య రెడ్డి. కొత్త నటి కాదు. ఆమె ఇప్పటికే పలు తెలుగు చిత్రాలలో నటించింది. అయితే ఆమె చేసింది ఎక్కువగా సైడ్ రోల్స్ కావడంతో ఆమెకు అంతగా గుర్తింపు రాలేదు. ఈ ప్రోమోతో ఆమె ప్రేక్షకుల దృష్టిలో పడడంతో ఆమె గురించి వెతుకుతున్నారు.
అలేఖ్య రెడ్డి ఇంటింటి రామాయణం, అశోక వనంలో అర్జున కల్యాణం , అర్థమైందా అర్జున్ కుమార్ వంటి చిత్రాలలో సినిమాల్లో నటించింది. అలేఖ్య రెడ్డి ఒక్క ప్రోమోలోనే నటించిందా? లేదా బిగ్ బాస్ 7 కంటెస్టెంట్ గా కూడా ఉంటుందా అనే విషయం తెలియాల్సిఉంది. ఇక రాబోయే బిగ్ బాస్ సీజన్లో దాదాపు ఇరవై మంది పోటీదారులు పాల్గొంటున్నారని సమాచారం.వీరిలో ఎక్కువగా సెలెబ్రెటీలు ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: ఈ పిల్లాడు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీనే ఏలేసే అంత పెద్ద హీరో అయ్యాడు..! ఎవరో తెలుసా..?